AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Open: సిన్నర్​కు చుక్కలు చూపించిన అల్కరాజ్.. యూఎస్ ఓపెన్‌తో కిరీటంతో పాటు నంబర్ 1 ర్యాంక్ సొంతం!

యూఎస్ ఓపెన్ 2025 టైటిల్‌ను మరోసారి కార్లోస్ అల్కరాజ్ గెలుచుకున్నాడు. ఇది అతనికి రెండవ యూఎస్ ఓపెన్ టైటిల్. ఫైనల్‌లో ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్‌ను ఓడించి ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో అల్కరాజ్, సిన్నర్ నుంచి వరల్డ్ నంబర్ 1 స్థానాన్ని కూడా తిరిగి పొందాడు. సిన్నర్ 65 వారాలుగా నంబర్ 1 స్థానంలో కొనసాగాడు.

US Open: సిన్నర్​కు చుక్కలు చూపించిన అల్కరాజ్.. యూఎస్ ఓపెన్‌తో కిరీటంతో పాటు నంబర్ 1 ర్యాంక్ సొంతం!
Carlos Alcaraz
Rakesh
|

Updated on: Sep 08, 2025 | 7:23 AM

Share

US Open: యూఎస్ ఓపెన్ 2025 టైటిల్‌ను మరోసారి కార్లోస్ అల్కరాస్ గెలుచుకున్నాడు. ఇది అతనికి రెండో యూఎస్ ఓపెన్ టైటిల్. ఈ టైటిల్ గెలవడానికి, అతను ఫైనల్‌లో ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ ను ఓడించాడు. ఈ విజయంతో అల్కరాస్ వరల్డ్ నంబర్ 1 ర్యాంకును తిరిగి దక్కించుకున్నాడు. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పై స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాస్, యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్‌ను 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో గెలుచుకున్నాడు. ఇది అతనికి రెండో యూఎస్ ఓపెన్ టైటిల్, మొత్తం ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ విజయంతో అతను 65 వారాలుగా ప్రపంచ నంబర్ 1 స్థానంలో ఉన్న సిన్నర్ ను వెనక్కి నెట్టేశాడు.

వీరిద్దరి మధ్య ఇది మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్. ఈ విజయంతో అల్కరాస్ 2-1 ఆధిక్యంలో ఉన్నాడు. హార్డ్ కోర్టులో ఇప్పటివరకు జరిగిన 9 మ్యాచ్‌లలో అల్కరాస్ 7-2తో సినర్‌పై ఆధిపత్యం కొనసాగించాడు. మొత్తం 15 మ్యాచ్‌లలో అల్కరాస్ 10-5తో సినర్‌పై ముందంజలో ఉన్నాడు.

ఫైనల్ మ్యాచ్

మొత్తం 2 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో, మొదటి సెట్‌ను అల్కరాస్ సులభంగా గెలుచుకున్నాడు. రెండో సెట్‌లో సినర్ పుంజుకున్నప్పటికీ, మూడో సెట్‌లో అల్కరాస్ 6-1తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. కీలకమైన నాలుగో సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. ఒత్తిడిని అధిగమించిన అల్కరాస్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచాడు.

ఛాంపియన్ సెలెబ్రేషన్స్

యూఎస్ ఓపెన్ గెలిచి ప్రపంచ నంబర్ 1 అయిన కార్లోస్ అల్కరాస్ తన విజయాన్ని వినూత్నంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. అతను షాంపైన్ జల్లుతో పాటు కోర్టులో క్రికెట్ ఆడినట్లుగా సంబరాలు చేసుకున్నాడు. అల్కరాస్ విజయం తర్వాత ఒక బ్యాట్స్‌మెన్ ఎలాగైతే షాట్ ఆడతాడో, అదే విధంగా బ్యాట్ పట్టుకున్నట్లుగా పోజు ఇచ్చి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సెలెబ్రేషన్స్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..