AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: బంగ్లాతో రెండో టెస్ట్ డ్రా అయితే భారత్‌కు గట్టి దెబ్బే! WTC ఫైనల్​ లెక్కలివే

భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టు రెండో రోజు వర్షం కారణంగా బంతి పడకుండానే రద్దయింది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన వర్షం శనివారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. దీంతో మైదానం పూర్తిగా తడిసిపోవడంతో 2వ రోజు ఆటను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు.

WTC Final: బంగ్లాతో రెండో టెస్ట్ డ్రా అయితే భారత్‌కు గట్టి దెబ్బే! WTC ఫైనల్​ లెక్కలివే
Team India
Basha Shek
|

Updated on: Sep 28, 2024 | 8:12 PM

Share

భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టు రెండో రోజు వర్షం కారణంగా బంతి పడకుండానే రద్దయింది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన వర్షం శనివారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. దీంతో మైదానం పూర్తిగా తడిసిపోవడంతో 2వ రోజు ఆటను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు. అంతకు ముందు వర్షం కారణంగా తొలిరోజు కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. ఈసారి టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి 35 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ఈ సమయంలో కర్మోడ కమ్ముకోవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇప్పుడు రెండో రోజు ఆట పూర్తిగా వర్షం పడింది. ఇక మిగిలింది మూడు రోజులు మాత్రమే. కానీ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఆదివారం కూడా వర్షం కురుస్తుంది కాబట్టి 3వ రోజు కూడా ఆట జరగడం అనుమానమే. నాలుగో, ఐదో రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి 2వ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. కాన్పూర్ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిస్తే టీమ్ ఇండియా సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండో టెస్టు మ్యాచ్ డ్రా అయినప్పటికీ భారత జట్టు 1-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంటుంది.

ఒక వేళ బంగ్లాతో రెండో టెస్టు డ్రాగా ముగిసినట్లయితే భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ఇప్పటివరకు ఈ WTCలో టీమ్‌ఇండియా 10 మ్యాచ్‌లు ఆడి 71.67 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేస్తే మిగిలిన 8 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ బంగ్లాతో మ్యాచ్‌ డ్రా అయితే మాత్రం భారత్‌ మిగిలిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదింట గెలిస్తేనే ఫైనల్ బెర్తు దక్కించుకుంటుంది. ఈ డబ్ల్యూటీసీలో భాగంగా టీమ్‌ఇండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌, ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీ (ఐదు టెస్టులు)లో తలపడనుంది. ఈ పటిష్ఠమైన జట్లతో సిరీస్ గెలవడం అంత సులభమేమీ కాదు. దీనికి తోడు ఆసీస్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. కాబట్టి టీమ్ఇండియా మున్ముందు జరగనున్న మ్యాచ్‌లను తేలిగ్గా తీసుకోకుండా గట్టిగా పోరాడి WTC ఫైనల్‌ చేరాలని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..