Shah Rukh Khan – Virat Kohli: విరాట్ కోహ్లీ నా అల్లుడు.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన షారుక్ ఖాన్..
Shah Rukh Khan - Virat Kohli: 'విరాట్ కోహ్లీ గురించి ఏదైనా చెప్పండి, ప్రతి రోజు అభిమానుల మధ్య పోరాటాన్ని చూస్తాం. యంగ్ స్టైల్‌లో విరాట్ గురించి కొన్ని మాటలు చెప్పండి అంటూ ఓ ప్రశ్న అడిగాడు. దీనికి కింగ్ ఖాన్ స్పందిస్తూ, 'నేను విరాట్ కోహ్లీని చాలా ప్రేమిస్తున్నాను. అతను నా స్వంతవాడు. నేను ఎల్లప్పుడూ అతని క్షేమం కోసం ప్రార్థిస్తాను. అతను మాకు అల్లుడు లాంటివాడు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా, షల్ మీడియాలో విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్ అభిమానుల మధ్య చాలా కాలంగా వార్ నడుస్తోంది.

Shah Rukh Khan – Virat Kohli: బాలీవుడ్ కింగ్ ఖాన్ అంటే షారుక్ ఖాన్ ప్రస్తుతం తన ‘జవాన్’ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతని రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఈ క్రమంలో షారుక్ తన అభిమానులతో ఈ ఆనందాన్ని పంచుకునేందుకు ట్విట్టర్‌లో #Asksrk సెషన్ నిర్వహించాడు. ఈ సమయంలో, అభిమానులు అతనిని కొన్ని ఫన్నీ, వింత ప్రశ్నలు అడిగారు. ఈ సెషన్‌లో టీమిండియా మాజీ ఆటగాడు విరాట్ కోహ్లీ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ ప్రశ్నకు కింగ్ ఖాన్ సమాధానమిస్తూ విరాట్‌ని తన అల్లుడు అని పిలిచాడు.
అసలే సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్ అభిమానుల మధ్య చాలా కాలంగా వార్ నడుస్తోంది. ఈ ఇద్దరు స్టార్స్‌లో సోషల్ మీడియాలో ఎవరు రారాజు అన్నదే ఈ యుద్ధం. అయితే, కోహ్లి, షారుక్‌ల మధ్య అనుబంధం ఎంత చక్కగా ఉందో ఎవరికీ చెప్పలేదు. ఇదిలా ఉంటే, సెషన్‌లో బాలీవుడ్ నటుడిని కోహ్లీకి సంబంధించిన ప్రశ్న అడగగా, అతను తన సమాధానంతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు.




వినియోగదారుడు షారుక్‌తో, ‘విరాట్ కోహ్లీ గురించి ఏదైనా చెప్పండి, ప్రతి రోజు అభిమానుల మధ్య పోరాటాన్ని చూస్తాం. యంగ్ స్టైల్‌లో విరాట్ గురించి కొన్ని మాటలు చెప్పండి అంటూ ఓ ప్రశ్న అడిగాడు. దీనికి కింగ్ ఖాన్ స్పందిస్తూ, ‘నేను విరాట్ కోహ్లీని చాలా ప్రేమిస్తున్నాను. అతను నా స్వంతవాడు. నేను ఎల్లప్పుడూ అతని క్షేమం కోసం ప్రార్థిస్తాను. అతను మాకు అల్లుడు లాంటివాడు అంటూ చెప్పుకొచ్చాడు.
టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపిన కింగ్ ఖాన్..
Indiaaaaaa…..Indiaaaa. All the best to the boys…..have a great World cup!! All the best https://t.co/g6A9xx8g83
— Shah Rukh Khan (@iamsrk) September 27, 2023
అదే సెషన్‌లో, రాబోయే ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేయమని ఒక వినియోగదారు షారుక్‌ను అడిగాడు. దీనికి కింగ్ ఖాన్ సమాధానమిస్తూ, ‘ఇండియా.. ఇండియా. ఆటగాళ్లందరికీ ఆల్ ది బెస్ట్. ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను అద్భుతంగా నిర్వహించాలి. అంతా మంచి జరగాలి’ అంటూ కోరాడు.
ప్రపంచ కప్ అక్టోబర్ 5 న ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. టోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది.
I love @imVkohli he is like my own and I pray always for his well being….bhai damaad jaisa hai humaara!!! https://t.co/SYB4sRPIqo
— Shah Rukh Khan (@iamsrk) September 27, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
