- Telugu News Photo Gallery Cricket photos Team India captain Rohit Sharma world record with Most International Sixes In A Country
Rohit Sharma: తుఫాన్ ఇన్నింగ్స్‌తో హిట్‌మ్యాన్ ప్రపంచ రికార్డ్.. భారత్‌లో నంబర్ 1 ప్లేయర్..
Rohit Sharma Records: ఈ మ్యాచ్‌లో 57 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. ఈ ఆరు సిక్సర్లతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మరో మైలురాయిని అధిగమించాడు. టీమ్ ఇండియాకు కెప్టెన్ అందించిన తుఫాన్ ఆరంభాన్ని ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. తద్వారా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్ చేయలేకపోయింది. 2-1తో గెలిచింది.
Updated on: Sep 28, 2023 | 5:50 AM

రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో సిక్సర్ కింగ్ కావడం విశేషం.

ఈ మ్యాచ్‌లో 57 బంతులు ఎదుర్కొన్న హిట్‌మన్ 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. ఈ ఆరు సిక్సర్లతో అంతర్జాతీయ క్రికెట్‌లో 550+ సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

ఇంతకు ముందు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఇలాంటి రికార్డు సృష్టించాడు. గేల్ 551 ఇన్నింగ్స్‌లలో మొత్తం 553 సిక్సర్లు కొట్టి క్రికెట్ చరిత్రలో సిక్సర్ కింగ్‌గా నిలిచాడు.

ఇప్పుడు రోహిత్ శర్మ 471 ఇన్నింగ్స్‌లలో మొత్తం 551 సిక్సర్లు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 550 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్రపంచంలో 2వ బ్యాట్స్‌మెన్‌గా మైలురాయిని అధిగమించాడు.

అలాగే, ఈ సిక్సర్లతో రోహిత్ శర్మ స్వదేశంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్‌లో తొలి ప్లేయర్‌గా నిలిచాడు.

గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ పేరిట ఉండేది. గప్టిల్ తన సొంత మైదానంలో మొత్తం 256 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

భారత్‌లో 262 సిక్సర్లు బాది స్వదేశంలో అత్యధిక సిక్సర్లు బాదిన నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.




