AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో చెత్త రికార్డ్.. 6 ఏళ్ల తర్వాత వన్డే ఫార్మాట్‌లో తొలిసారి..

India vs Australia: రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కంగారూ బ్యాట్స్‌మెన్స్ జస్ప్రీత్ బుమ్రాపై ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే, మ్యాచ్ చివరి ఓవర్లలో బుమ్రా అద్భుతంగా పునరాగమనం చేశాడు. ఆస్ట్రేలియా జట్టు తరపున ఈ మ్యాచ్‌లో, ఓపెనర్ మిచెల్ మార్ష్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 96 పరుగుల ఇన్నింగ్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మార్ష్‌తో పాటు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే కూడా హాఫ్ సెంచరీలు సాధించారు. బుమ్రా తన 10 ఓవర్లలో 81 పరుగులు ఇచ్చి, 3 వికెట్లు తీశాడు.

IND vs AUS: జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో చెత్త రికార్డ్.. 6 ఏళ్ల తర్వాత వన్డే ఫార్మాట్‌లో తొలిసారి..
Jasprit Bumrah
Venkata Chari
|

Updated on: Sep 28, 2023 | 5:20 AM

Share

Jasprit Bumrah: భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. భారత్ తరపున ఈ మ్యాచ్‌లో, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఒక మ్యాచ్ విశ్రాంతి తర్వాత తిరిగి వచ్చాడు. బుమ్రా తన 10 ఓవర్లలో 81 పరుగులు ఇచ్చి, 3 వికెట్లు తీశాడు.

వన్డే కెరీర్‌లో రెండో అత్యంత ఖరీదైన స్పెల్ విసిరిన బుమ్రా..

రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 10 ఓవర్లలో 81 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా వన్డే కెరీర్‌లో ఇది రెండో అత్యంత ఖరీదైన స్పెల్. అతని ODI కెరీర్‌లో అత్యంత ఖరీదైన స్పెల్ 2017లో కటక్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా 9 ఓవర్లలో 81 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

బుమ్రా మూడవ అత్యంత ఖరీదైన స్పెల్ గురించి మాట్లాడితే, ఇది 2017 సంవత్సరంలో ఇంగ్లాండ్‌పై వచ్చింది. ఈ క్రమంలో బుమ్రా 79 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. బుమ్రా నాల్గవ అత్యంత ఖరీదైన ODI స్పెల్ ఆస్ట్రేలియాపై వచ్చింది. 2020లో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా 79 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు.

చివరి ఓవర్లలో సత్తా చాటిన బుమ్రా..

రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కంగారూ బ్యాట్స్‌మెన్స్ జస్ప్రీత్ బుమ్రాపై ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే, మ్యాచ్ చివరి ఓవర్లలో బుమ్రా అద్భుతంగా పునరాగమనం చేశాడు. ఆస్ట్రేలియా జట్టు తరపున ఈ మ్యాచ్‌లో, ఓపెనర్ మిచెల్ మార్ష్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 96 పరుగుల ఇన్నింగ్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మార్ష్‌తో పాటు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే కూడా హాఫ్ సెంచరీలు సాధించారు.

మూడో వన్డేలో ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే..

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ (కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంగా, జోష్ హేజిల్‌వుడ్‌.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..