Video: ఎవరు భయ్యా నువ్వు, ఇంత విచిత్రంగా ఉన్నావ్.. యోగాసనాలతో డాన్స్ మిక్సింగ్.. ఈ అంపైర్‌ను చూస్తే నవ్వుకోవాల్సిందే

Umpire Dancing Video: క్రికెట్ సీజన్ నడుస్తుండగా సోషల్ మీడియాలో ఓ అంపైర్ కూడా హంగామా సృష్టించాడు. క్రికెట్ గ్రౌండ్‌లో తన హావభావాలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాడు. దీంతో ఈ అంపైర్‌ని నిజంగా అంపైర్ అని పిలవాలో లేదా డ్యాన్సర్ అని పిలవాలో నిర్ణయించడం కష్టంగా మారిందంటూ సెటైర్లు వేస్తున్నారు.

Video: ఎవరు భయ్యా నువ్వు, ఇంత విచిత్రంగా ఉన్నావ్.. యోగాసనాలతో డాన్స్ మిక్సింగ్.. ఈ అంపైర్‌ను చూస్తే నవ్వుకోవాల్సిందే
Umpire Dancing Like Cheer Leader
Follow us

|

Updated on: Jul 08, 2024 | 7:54 PM

Umpire Dancing Video: ప్రస్తుతం భారత్‌లో ఎక్కడ చూసినా.. టీ-20 ప్రపంచకప్‌ గెలుచుకున్న టీమిండియా ఘనత గురించే ప్రతి క్రికెట్ అభిమాని మాట్లాడుతున్నాడు. క్రికెటర్ల ఆట తీరుతోపాటు, మైదానంలో హావభావాలు ఇలా ప్రతీ ఒక్కటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ట్రోఫీని కైవసం చేసుకున్న టీమ్ ఇండియా.. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల హృదయాలను దొచుకుంది. క్రికెట్ సీజన్ నడుస్తుండగా సోషల్ మీడియాలో ఓ అంపైర్ కూడా హంగామా సృష్టించాడు. క్రికెట్ గ్రౌండ్‌లో తన హావభావాలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాడు. దీంతో ఈ అంపైర్‌ని నిజంగా అంపైర్ అని పిలవాలో లేదా డ్యాన్సర్ అని పిలవాలో నిర్ణయించడం కష్టంగా మారిందంటూ సెటైర్లు వేస్తున్నారు.

అంపైర్ ఎందుకు వైరల్ అవుతున్నాడు?

ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరిగితే, జట్టు ఆటగాళ్లే కాకుండా, మైదానంలో ఒక అంపైర్ కూడా ఉంటారనే సంగతి తెలిసిందే. అతని పని చాలా ముఖ్యమైనది. ఆటగాడు అవుట్ అయినా లేకపోయినా, ఆ బాల్ వైడ్ బాల్ అయినా నో బాల్ అయినా, ఆటగాడు ఫోర్, సిక్సర్ కొట్టాడా? లేదా అని కేవలం అంపైర్ మాత్రమే తన హావభావాల ద్వారా ఈ సమాచారాన్నంతా ఇస్తుంటాడు. అయితే ఒక్కొక్కిరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఇలాంటి వాళ్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కానీ, ప్రస్తుతం ఈ అంపైర్ ఆ వీడియోలకు భిన్నంగా ఉన్నాడు. ఈ అంపైర్ అందించే సంకేతాలు చాలా వెరైటీగా ఉన్నాయి. దీంతో ఈయన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సూరత్ టెన్నిస్ క్రికెట్ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఈ వీడియోను పంచుకుంది. దీనిలో అంపైర్ చాలా భిన్నమైన శైలిలో కనిపిస్తున్నాడు. ఫీల్డ్‌లో ఏమి జరుగుతుందో తెలియక అభిమానులు కూడా నిల్చోని మరీ చూస్తున్నారు. ఫోర్, సిక్స్ కొట్టినప్పుడు, వికెట్ పడినప్పుడు, వైడ్ బాల్ అయినప్పుడు ఇలా విచిత్రంగా డ్యాన్ చేస్తూ.. తల కింద పెట్టి కాళ్లు పైకి లేపి మరీ సిగ్నల్ ఇస్తున్నాడు. ఒక్కోసారి నడుము ఊపుతూ, మరోసారి ఎక్సర్ సైజ్ చేస్తూ సిగ్నల్స్ ఇస్తున్నాడు. ఈ క్లిప్‌ని చూసిన యూజర్లు అంపైర్‌ను చాలా ప్రతిభావంతుడిగా పిలుస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘అతను డాన్సర్, అంపైర్ లేదా యోగా చేస్తున్నారా? చెప్పడం కష్టం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వింత హావభావాల వల్ల ఈ అంపైర్‌కి ఇప్పటి వరకు 4 లక్షల 66 వేల లైక్‌లు వచ్చాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!