IND vs ZIM: భారత జట్టుతో చేరిన ముగ్గురు స్టార్ బ్యాటర్లు.. ప్లేయింగ్ 11 నుంచి ఆ ఇద్దరు ఔట్..

India vs Zimbabwe 3rd T20I: టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ టీమ్‌లో సభ్యులుగా ఉన్న శివమ్ దూబే, సంజు శాంసన్ మరియు యశస్వి జైస్వాల్ ఇప్పుడు జింబాబ్వేలో టీమిండియాలో చేరడంతో మూడో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా మరింత బలాన్ని పొందింది. ఇలా ప్లేయింగ్ 11 మందిని తదుపరి మ్యాచ్ కు ఎంపిక చేయడం కెప్టెన్ కు, కోచ్ కు పెద్ద తలనొప్పిగా మారింది.

IND vs ZIM: భారత జట్టుతో చేరిన ముగ్గురు స్టార్ బ్యాటర్లు.. ప్లేయింగ్ 11 నుంచి ఆ ఇద్దరు ఔట్..
Ind Vs Zim T20i Series
Follow us

|

Updated on: Jul 08, 2024 | 8:07 PM

IND vs ZIM: భారత్-జింబాబ్వే మధ్య 5 మ్యాచ్‌ల టీ20 క్రికెట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరిస్‌లోని తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ ఘోర పరాజయం చవిచూసింది. రెండో మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. ఇప్పుడు మూడో టీ20 మ్యాచ్‌కి ముందు టీమిండియాకు మరింత బలం పుంజుకుంది. టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ టీమ్‌లో సభ్యులుగా ఉన్న శివమ్ దూబే, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ ఇప్పుడు జింబాబ్వేలో టీం ఇండియాలో చేరారు. దీంతో ప్లేయింగ్ 11ను తదుపరి మ్యాచ్‌కు ఎంపిక చేయడం కెప్టెన్‌కు, కోచ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

భారత జట్టులో చేరిన ముగ్గురూ అనుభవజ్ఞులు..

సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే, రెండో మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కానీ, టీమిండియా ఇప్పుడు ఎలాంటి రిస్క్ తీసుకునే స్థితిలో లేదు. అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్స్ సంజూ శాంసన్‌, యశస్వి జైస్వాల్‌, శివమ్‌ దూబేలను ప్లేయింగ్‌-11లో చేర్చుకోవడం జట్టు కెప్టెన్‌, కోచ్‌కి సవాలు ఎదురుకానుంది. ఎందుకంటే తొలి మ్యాచ్‌లో జట్టు ఓటమికి ఆటగాళ్ల అనుభవం లేకపోవడమే అతిపెద్ద కారణం. తొందరపాటు కారణంగా జట్టు చిన్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది.

ప్లేయింగ్ 11 నుంచి తప్పుకునేది ఎవరు?

తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధ్రువ్ జురెల్‌లు జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు. తద్వారా రియాన్ పరాగ్‌కు బదులుగా యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ జట్టులో యశస్వి జైస్వాల్ కూడా చేరాడు. కానీ ఆడే అవకాశం రాలేదు.

అదే సమయంలో, ధృవ్ జురెల్ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో ధృవ్ జురెల్ భారత్ క్లిష్ట పరిస్థితుల్లోనూ 14 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి జట్టు ఒత్తిడిని పెంచాడు. కాబట్టి సంజూ శాంసన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా జట్టులో చేరవచ్చు.

శివమ్ దూబేకి కూడా అవకాశం..

టీ20 క్రికెట్‌లో టీమ్‌ఇండియాను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన శివమ్ దూబే జింబాబ్వేతో జరిగే మూడో టీ20 మ్యాచ్‌లో ప్లేయింగ్-11లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో, శివమ్ దూబే భారత్ తరపున మొత్తం 8 మ్యాచ్‌లు ఆడి 133 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ మొత్తంలో శివమ్ దూబే తన ఘనతను ప్రదర్శించనప్పటికీ, దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో, అతను 16 బంతుల్లో 27 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్‌ను ఆడి జట్టు టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

జింబాబ్వేతో జరిగే మూడో మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ స్థానంలో శివమ్ దూబే ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరవచ్చు. తొలి మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ 34 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కానీ, జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బాగా రాణించినప్పటికీ, శివమ్ దూబేకి దారితీసేందుకు వాషింగ్టన్ సుందర్ మూడో మ్యాచ్‌లో తొలగించవచ్చు.

మూడో మ్యాచ్‌కి భారత ప్రాబబుల్ ప్లేయింగ్ 11: శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!