Azharuddin: అజారుద్దీన్‎కు షాక్.. హెచ్‎సీఏ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాల్సిందేనని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు..

మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‎కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. హెచ్‎సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్‎ దిగిపోవాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కొన్ని నెలల క్రితం ప్రెసిడెంట్‎ పదవి నుంచి అజారుద్దీన్‎ను అపెక్స్ కౌన్సిల్‎ సస్పెండ్ చేసింది...

Azharuddin: అజారుద్దీన్‎కు షాక్.. హెచ్‎సీఏ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాల్సిందేనని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు..
Suprem
Follow us

|

Updated on: Oct 21, 2021 | 5:10 PM

మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‎కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. హెచ్‎సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్‎ దిగిపోవాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కొన్ని నెలల క్రితం ప్రెసిడెంట్‎ పదవి నుంచి అజారుద్దీన్‎ను అపెక్స్ కౌన్సిల్‎ సస్పెండ్ చేసింది. అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై అంబుడ్స్ మెన్ దీపక్ వర్మ తో కలిసి అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

ఫిబ్రవరి 26, 2020లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‎పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండటం, హెచ్‎​సీఏ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాలతో హెచ్‎​సీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు అజార్‎​కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్​ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న తనకు నోటీసులు ఇవ్వడంపై మహమ్మద్ అజహరుద్దీన్ మీడియా సమావేశం నిర్వహించి అపెక్స్ కౌన్సిల్‎​పై మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్‌ సభ్యులకు నోటీసులు ఇచ్చే హక్కు లేదని చెప్పారు. కౌన్సిల్‌లో మెజారిటీ లేకుండా సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కొందరు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

లోధా సిఫార్సుల మేరకే నోటిసులు ఇచ్చామని అపెక్స్ కౌన్సిల్  స్పష్టం చేసింది. కౌన్సిల్​లో వర్గాలు ఉన్నాయని అజహరుద్దీన్ అనడం సరికాదని చెప్పింది. వీలైతే ఆయన కోర్టుకు వెళ్లి పోరాటం చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయంలో బీసీసీఐ జోక్యం ఉండదని తేల్చి చెప్పింది. దీంతో అజారుద్దీన్‎ సుప్రీకోర్టు వెళ్లాడు. అయితే సుప్రీం కోర్టు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని సమర్థించింది. హెచ్‎సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్‎ దిగిపోవాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Read Also.. T20 World Cup: ఇలా బాల్ వేస్తే అలా ఔటవుతాడు.. యువ స్పిన్నర్‎కు విరాట్ కోహ్లీ సూచనలు.. వెంటనే వికెట్ తీసిన బౌలర్..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో