T20 World Cup: ఇలా బాల్ వేస్తే అలా ఔటవుతాడు.. యువ స్పిన్నర్‎కు విరాట్ కోహ్లీ సూచనలు.. వెంటనే వికెట్ తీసిన బౌలర్..

భారత్, ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఓ సీన్ అందరిని ఆకర్షించింది. ఈ సీన్‎లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ యువ స్పిన్నర్‎కు కొన్ని సూచనలు చేశాడు. ఈ సూచనలు పాటించిన బౌలర్ వికెట్ తీశాడు....

T20 World Cup: ఇలా బాల్ వేస్తే అలా ఔటవుతాడు.. యువ స్పిన్నర్‎కు విరాట్ కోహ్లీ సూచనలు.. వెంటనే వికెట్ తీసిన బౌలర్..
Virat Kohli
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 21, 2021 | 3:56 PM

భారత్, ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఓ సీన్ అందరిని ఆకర్షించింది. ఈ సీన్‎లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ యువ స్పిన్నర్‎కు కొన్ని సూచనలు చేశాడు. ఈ సూచనలు పాటించిన బౌలర్ వికెట్ తీశాడు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరు.. ఔటైన బ్యాట్స్‎మెన్ ఎవరో చూద్దాం పదండి.

బుధవారం భారత్, ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్‎లో తొలుత కంగారులు బ్యాటింగ్ చేశారు. అరంభంలో ఆసీస్ ఆటగాళ్లను భారత బౌలర్లు కట్టడి చేశారు. డెవిడ్ వార్నర్, అరోన్ ఫించ్, మిచెల్ మార్ష్‎ను తక్కువ స్కోర్లకే ఔట్ చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్ వికెట్ పడకుండా ఆడారు. గ్లెన్ మాక్స్‌వెల్ ధాటిగా ఆడటం మొదలు పెట్టాడు. దీంతో అతడి ఎలా ఔట్ చేయాలో బౌలర్లకు తెలియడం లేదు. ఈ మ్యాచ్‎లో విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ఫీల్డింగ్‎కు వచ్చాడు.

12 వ ఓవర్‌లో మాక్స్‌వెల్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌కు అద్భుతమైన బౌండరీతో స్వాగతం పలికారు. ఆ తర్వాత, కోహ్లీ చాహర్‎కు సూచన చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సహచరుడు గ్లెన్ మాక్స్‌వెల్ వికెట్ ఎలా తీయాలో స్పిన్నర్ రాహుల్ చాహర్‎కు వివరించాడు. కోహ్లీ సలహా విన్న రాహుల్ వరుసగా మూడు డాట్ బాల్స్ వేశాడు. చివరకు మాక్స్‌వెల్‎ను ఔట్ చేశాడు. ఈ ఘటన అందరిని ఆకర్షించింది. ఈ మ్యాచ్‎లో మ్యాక్స్‌వెల్ 37 పరుగులు చేశాడు. ఈ వార్మప్ మ్యాచ్‎కి రోహిత్ శర్మ కెప్టెన్‎గా వ్యవహరించాడు.

ఈ మ్యాచ్‎లో ఆస్ట్రేలియా 152 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు బ్యాటింగ్ దిగిన భారత ఆటగాళ్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ శుభారంభం చేశారు. మొదటి ఆరు ఓవర్లలో 42 పరుగులు చేశారు. ఇద్దరూ కలిసి 68 పరుగులు చేశారు. 10 వ ఓవర్‌లో అష్టన్ అగర్ బౌలింగ్ లో కెఎల్ రాహుల్ (39) డేవిడ్ వార్నర్ చేతికి చిక్కారు. తర్వాత రోహిత్, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‎ను ముందుకు నడిపారు. రోహిత్ 60 పరుగులు చేసి రిటైర్ హర్ట్‎గా వెనుదిరిగాడు. సూర్యకుమార్‌, హార్దిక్ పాండ్యా కలిసి వికెట్ పడకుండా 153 పరుగుల లక్ష్యాన్ని సాధించారు.

View this post on Instagram

A post shared by ICC (@icc)

Read Also.. T20 World Cup 2007: తొలి ప్రపంచ కప్ గెలిచిన భారత హీరోలు.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా.. ప్రస్తుత జట్టులో ఎంతమంది ఉన్నారంటే?