- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup 2021: First t20 World Cup winners, Do you know Where and what are doing now the Indian players who shared in the historic victory
T20 World Cup 2007: తొలి ప్రపంచ కప్ గెలిచిన భారత హీరోలు.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా.. ప్రస్తుత జట్టులో ఎంతమంది ఉన్నారంటే?
T20 World Cup 2021: 2007 లో టీమిండియా టీ 20 ప్రపంచకప్‌ని గెలుచుకుంది. కానీ, అప్పటి నుంచి రెండోసారి వరల్డ్ కప్‌ని గెలవలేదు. 2014 లో ఫైనల్ ఆడినా.. రన్నరప్‌గానే నిలిచింది.
Updated on: Oct 21, 2021 | 12:13 PM

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో జరిగిన మొదటి టీ 20 ప్రపంచకప్ ట్రోఫీని భారత్ సాధించింది. ప్రపంచ విజేత జట్టు యువకులతో కళకళాడింది. ఎందుకంటే ఆ సమయంలో జట్టులోని చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ప్రపంచకప్ ఆడకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. ధోనీ కెప్టెన్సీలో ఈ జట్టు ప్రపంచకప్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, ధోనీ సేన అద్భుతం చేసింది. నేటికీ అది పునరావృతం కాలేదు. ఆ చారిత్రాత్మక విజయంలో ఎవరు ఉన్నారు.. వారు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.

ఆనాటి జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. తొలిసారిగా టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ధోనీ టీమిండియాకు మెంటార్‌గా పనిచేస్తున్నాడు. అలాగే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌ని తన కెప్టెన్సీలో IPL-2021 టైటిల్ విజేతగా నిలిపాడు.

2007 ప్రపంచకప్‌లో జట్టు విజయంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్‌పై యువరాజ్ కొట్టిన ఓవర్‌లో ఆరు సిక్సర్లు ఎవరూ మర్చిపోలేరు. 2019 వరకు యువరాజ్ ఐపీఎల్ ఆడాడు. అనంతరం క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం అతను కొన్ని చిన్న లీగ్‌లలో ఆడుతున్నాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడుతున్నాడు.

ఆ జట్టులోని అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. గాయం కారణంగా ఫైనల్ ఆడలేకపోయాడు. కానీ, ప్రపంచ కప్ అంతటా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం సెహ్వాగ్ వ్యాఖ్యాతగా బిజీగా ఉన్నారు.

గౌతమ్ గంభీర్ లేని ప్రపంచకప్ జట్టు గురించి మాట్లాడడమంటే సాధ్యం కాదు. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఫైనల్‌లోనూ అతని బ్యాట్ మెరిసింది. ప్రస్తుతం గంభీర్ వ్యాఖ్యానంతోపాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు.

ఆ సమయంలో భారత క్రికెట్‌లో రాబిన్ ఉతప్ప పేరు మారుమోగిపోయింది. అతను తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఉతప్ప టీమిండియాలో భాగం కాలేదు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఆడుతున్నాడు.

రోహిత్ శర్మ. ఈ యువ బ్యాట్స్‌మెన్ ప్రస్తుతం టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆడుతున్న జట్టులో రోహిత్ ఒక్కడే అప్పటి జట్టులో ఉన్నాడు.

ప్రస్తుతం దినేష్ కార్తీక్ కూడా టీమిండియాలో భాగం కాలేదు. IPL 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు.

yusuf patan

అజిత్ అగార్కర్ ఆ జట్టులో అత్యంత అనుభవం ఉన్న ఆటగాడిగా ఉన్నాడు. ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్ తరపున వ్యాఖ్యానం చేస్తున్నాడు.

ప్రపంచకప్ గెలిచిన జట్టులో పీయూష్ చావ్లా ఉన్నాడు. ఇంకా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. IPL-2021 లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు.

2007 ప్రపంచకప్ తర్వాత జోగిందర్ శర్మ పేరు మారుమోగిపోయింది. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చివరి ఓవర్ బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ప్రస్తుతం ఈ ఆటగాడు హర్యానా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నాడు.

అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో హర్భజన్ సింగ్ పేరు కూడా ఉంది. హర్భజన్ ఇంకా రిటైర్ కాలేదు. IPL-2021 లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.

రుద్ర ప్రతాప్ సింగ్ భారతదేశానికి ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఎడమ చేతివాటం బౌలర్ అయిన ఆర్‌పీ సింగ్.. 2018 లో రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం వ్యాఖ్యాతగా పనిచేస్తున్నాడు. అలాగే అబుదాబి టీ10 లీగ్‌లో ఆడుతున్నాడు.

ప్రపంచ విజేత జట్టులో ఇర్ఫాన్ పఠాన్ కూడా ఉన్నాడు. పఠాన్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యాడు. కొన్ని రోజుల క్రితం రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో కనిపించాడు. ప్రస్తుతం వ్యాఖ్యాతగా బిజీగా ఉన్నాడు.

టీమిండియాను ప్రపంచ ఛాంపియన్‌గా చేసిన వారిలో శ్రీశాంత్ కూడా ఒకడిగా నిలిచాడు. చివరి క్యాచ్‌ను పట్టుకుని భారత్ విజయానికి కారకుడయ్యాడు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకున్న శ్రీశాంత్ జట్టు భారత జట్టులోకి తిరిగి రావడం చాలా కష్టమైంది. ప్రస్తుతం కేరళ తరఫున ఆడుతున్నాడు.





























