IPL 2022: ఐపీఎల్‌పై కన్నేసిన రొనాల్డో క్లబ్..? ఇకపై ఒకే వేదికలో కనిపించనున్న ఇద్దరు దిగ్గజాలు..!

Manchester United: ఐపీఎల్ 2020లో రెండు కొత్త జట్ల కోసం బీసీసీఐ టెండర్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనికి చివరి తేదీ నిన్నటితో ముగిసింది. కానీ..

IPL 2022: ఐపీఎల్‌పై కన్నేసిన రొనాల్డో క్లబ్..? ఇకపై ఒకే వేదికలో కనిపించనున్న ఇద్దరు దిగ్గజాలు..!
Manchester United

IPL 2022: ఐపీఎల్ రెండు కొత్త జట్లను కొనేందుకు భారతదేశంతో పాటు విదేశాలలో కూడా చాలా ఆసక్తి ఉంది. ప్రపంచంలోని బలమైన ఫుట్‌బాల్ జట్టు మాంచెస్టర్ యునైటెడ్ యజమాన్యం కూడా కొత్త ఐపీఎల్ జట్లపై ఆసక్తి చూపుతున్నారంట. ఈ జట్టు యాజమాన్యం గ్లేజర్ కుటుంబానికి చెందినది. మాంచెస్టర్ యునైటెడ్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ, ఖరీదైన ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ క్లబ్‌కు అభిమానులు ఉన్నారు. క్రిస్టియానో ​​రొనాల్డో ప్రస్తుతం ఈ జట్టు కోసం ఆడుతున్నాడు. ఈ జట్టు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఆఫ్ ఇంగ్లండ్‌లో భాగంగా ఉంది. చాలా మంది భారత క్రికెటర్లు కూడా మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు అభిమానులు. ఇటీవల జస్ప్రీత్ బుమ్రా ఈ క్లబ్ స్టేడియాన్ని సందర్శించారు. అతను క్లబ్ నుంచి బహుమతిగా జెర్సీని కూడా పొందాడు. బుమ్రాకు ముందే చాలా మంది భారత క్రికెటర్లు ఈ క్లబ్‌ను సందర్శించారు.

ఐపీఎల్ టీంను కొనడానికి గ్లేజర్ కుటుంబం టెండర్ పత్రాలు కొనుగోలు చేసిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దీన్ని ఒక ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ ద్వారా బిడ్ దాఖలు చేస్తున్నట్లు పేర్కొంది. ఐపీఎల్ టీంపై కంపెనీ చాలా హోప్స్‌ పెట్టుకుందంట. కొత్త జట్ల టెండర్‌కు సంబంధించిన చివరి తేదీని బీసీసీఐ అక్టోబర్ 20గా నిర్ణయించింది. అయితే నిన్నటితో ఆ తేదీ ముగిసింది. కానీ, బీసీసీఐ ఈ చివరి తేదీని పొడిగించినట్లు తెలుస్తోంది. అది కూడా కేవలం మాంచెస్టర్ యునైటెడ్ కోసం పొడిగించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మాంచెస్టర్ యునైటెడ్ ఐపీఎల్ జట్టును కొనుగోలె చేస్తే.. ఐపీఎల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. అలాగే బీసీసీకి మరింత డబ్బు వచ్చి చేరనుంది. దీంతో బిడ్లకు చివరి తేదీని పొడిగించిందని వార్తలు వెలువడుతున్నాయి.

ఆసక్తి చూపిస్తున్న పెద్ద కంపెనీలు..
బీసీసీఐ జారీ చేసిన నిబంధనలలో విదేశీ కంపెనీలు కూడా జట్టును కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చారు. వారు బిడ్ గెలిస్తే, వారు భారతదేశంలో కంపెనీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. మాంచెస్టర్ యునైటెడ్ యజమాన్యం బిడ్‌కు సంబంధించిన పత్రాలను కొనుగోలు చేసినట్లు నివేదిక పేర్కొంది. కొత్త జట్లను సొంతం చేసుకునే రేసులో అదానీ గ్రూప్, టోరెంట్ ఫార్మా, అరబిందో ఫార్మా, ఆర్‌పి-సంజీవ్ గోయెంకా గ్రూప్, హిందుస్థాన్ టైమ్స్ మీడియా, జిందాల్ స్టీల్, రోనీ స్క్రూవాలా, ముగ్గురు ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్‌లు ఉన్నారు.

ముందు వరుసలో అహ్మదాబాద్..
అహ్మదాబాద్, లక్నో, గౌహతి, కటక్, ఇండోర్, ధర్మశాల వంటి నగరాలు కొత్త జట్ల హోస్ట్‌లుగా ముందంజలో ఉన్నాయి. వీటిలో ఏవైనా రెండు నగరాలు మాత్రమే ఫ్రాంచైజీలుగా ఎంపిక కానున్నాయి. అనగా ఏదైనా రెండు నగరాల్లో మాత్రమే కొత్త జట్లు ఉంటాయి. వాటిలో అహ్మదాబాద్ పేరు ముందు వరుసలో ఉంది. ఇటీవల నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కారణంగా, ఇక్కడ చాలా ఆసక్తి కనబడుతోంది. అలాగే, అహ్మదాబాద్ చాలా కాలంగా కొత్త జట్టు కోసం రేసులో ఉంది. 2010 లో కూడా రెండు కొత్త జట్ల కోసం వేట ప్రారంభమైనప్పుడు, అహ్మదాబాద్ పేరు కూడా లిస్టులో ఉంది. ఈ నగరం తరపున బిడ్డింగ్ కూడా జరిగింది. కానీ, తరువాత పూణే, కొచ్చి ఫ్రాంచైజీలు ఏర్పడ్డాయి. కానీ, ఈసారి అహ్మదాబాద్ ఫ్రాంచైజీపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంది.

Also Read: T20 World Cup 2007: తొలి ప్రపంచ కప్ గెలిచిన భారత హీరోలు.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా.. ప్రస్తుత జట్టులో ఎంతమంది ఉన్నారంటే?

T20 World Cup: దుబాయ్‌లో బ్యాటింగ్.. అబుదాబి, షార్జాల్లో బౌలింగ్.. కీలకం కానున్న టాస్.. యూఏఈ పిచ్‌ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే.?

Click on your DTH Provider to Add TV9 Telugu