AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: దుబాయ్‌లో బ్యాటింగ్.. అబుదాబి, షార్జాల్లో బౌలింగ్.. కీలకం కానున్న టాస్.. యూఏఈ పిచ్‌ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే.?

UAE Pitch Reports: టీ 20 ప్రపంచకప్‌ ముందు ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఈ పిచ్‌లపై జరిగాయి. వాటి ఆధారంగా ఈ మూడు మైదానాల్లో మ్యాచుల పరిస్థితి ఎలా ఉండనుందో చూద్దాం.

T20 World Cup: దుబాయ్‌లో బ్యాటింగ్.. అబుదాబి, షార్జాల్లో బౌలింగ్.. కీలకం కానున్న టాస్.. యూఏఈ పిచ్‌ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే.?
Dubai Stadium
Venkata Chari
|

Updated on: Oct 21, 2021 | 11:54 AM

Share

T20 World Cup 2021 UAE Pitch Reports: టీ 20 ప్రపంచకప్‌లో సూపర్ -12 మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు మూడు యూఏఈ మైదానాలు- అబుదాబి, దుబాయ్, షార్జాలో జరగనున్నాయి. టీ 20 ప్రపంచకప్‌ ముందు ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఈ పిచ్‌లపై జరిగాయి. వాటి ఆధారంగా ఈ మూడు మైదానాల్లో మ్యాచుల పరిస్థితి ఎలా ఉండనుందో చూద్దాం.

షార్జా ఐపీఎల్ 2021 రెండవ దశకు ముందు షార్జాలోని పిచ్‌లు పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందు ఇక్కడ పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌లకు స్వర్గధామంగా నిలిచాయి. 2020 ఎడిషన్‌లో జట్లు ప్రతి 12 బంతుల్లో ఒక సిక్స్ కొట్టాయి. కానీ, 2021 లో ఈ సంఖ్య 23 గా ఉంది. 2021 లో ఇక్కడ జరిగిన పది ఐపీఎల్ మ్యాచ్‌లలో 98 సిక్సర్లు కట్టారు. ప్రస్తుతం ఈ పిచ్ పూర్తిగా మందగించింది.

ఐపీఎల్‌లో ఇక్కడ పేస్ మార్చిన బౌలర్లు మరింత విజయాన్ని సాధించారు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్ల ఎకానమీ రేట్లు వరుసగా 6.92, 6.79 గా ఉన్నాయి. అదే సమయంలో షార్జా పిచ్‌లో, స్పిన్నర్ల కంటే ఫాస్ట్ బౌలర్ల స్ట్రైక్ రేట్ మెరుగ్గా ఉంది. స్పిన్నర్లు ప్రతి 22 బంతుల్లో వికెట్లు తీస్తుండగా, ఫాస్ట్ బౌలర్లు ప్రతి 17 బంతుల్లో ఒక వికెట్ తీసుకున్నారు.

సూపర్ 12 లో, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ షార్జాలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒకవేళ పిచ్ ఐపీఎల్ లాగానే ఉంటే పాకిస్తాన్, దక్షిణాఫ్రికా ఈ పరిస్థితులకు ఉత్తమ జట్లుగా ఉండనున్నాయి.

ఇరు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దింపేందుకు అవకాశం ఉంది. అలాగే, వారి బ్యాటింగ్ లైనప్‌లో ఎక్కువ పవర్-హిట్టర్లు లేవు. స్పిన్ బాగా ఆడతారు. ఈ పిచ్‌లో 180-200 పరుగులు చేయడం కష్టం. ఒక జట్టు 140-160 పరుగులు చేస్తే, అది ఈ పిచ్‌లో గౌరవప్రదమైన స్కోరుగా మారనుంది.

దుబాయ్ గత కొన్ని సంవత్సరాలుగా దుబాయ్ పిచ్‌లు పెద్దగా మారలేదు. కొన్ని పిచ్‌లు నెమ్మదిగా ఉన్నాయి. కొన్ని ఫాస్ట్ బౌలర్లకు సహాయపడ్డాయి. ఐపీఎల్ గత రెండు సీజన్లలో ఇక్కడ సగటు స్కోరు 150-160 మధ్య ఉంది. స్పిన్నర్లు ఇక్కడ 32 పరుగులకు ఒక వికెట్ తీసుకున్నారు. ఫాస్ట్ బౌలర్లు ఒక్కో వికెట్‌కు 27 పరుగులు ఇచ్చి తీసుకున్నారు. ఫాస్ట్ బౌలర్లు దుబాయ్ పిచ్‌లో మరింత విజయవంతమవుతారు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో జట్లు దుబాయ్‌లో అడుగుపెట్టేందుకు అవకాశం ఉంద.

టీమిండియా సూపర్ -12 లో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దుబాయ్‌లో 4 మ్యాచ్‌లు ఆడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ పిచ్‌లపై జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ పాత్ర చాలా కీలకం కానుంది.

అబుదాబి అబుదాబి పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. అయితే ఇక్కడ మూడు బౌండరీ లైన్‌లు దుబాయ్, షార్జా కంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. ఈ మైదానంలో స్పిన్నర్లకు పెద్దగా సహాయం లభించదు. వారి సగటు ఒక్కో వికెట్‌కు 33 పరుగులు ఇవ్వగా, ఫాస్ట్ బౌలర్ల సగటు ప్రతి వికెట్‌కు 29 పరుగులుగా ఉంది.

రాత్రి మ్యాచ్‌లలో ఎక్కువ మంచు కురుస్తుంది. కాబట్టి మధ్యాహ్నం మ్యాచ్‌లు, సాయంత్రం మ్యాచ్‌లు చాలా భిన్నంగా ఉంటాయి. మంచుతో కూడిన రాత్రి మ్యాచ్‌లో అధిక స్కోర్‌లను ఛేజ్ చేస్తున్న జట్లకు అనుకూలంగా ఉంటాయి. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. అందులో రెండు మ్యాచ్‌లు మధ్యాహ్నం జరగనున్నాయి.

కీలకం కానున్న టాస్.. ప్రపంచ కప్ అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించనుండడంతో.. ఈ సమయంలో యూఏఈలో వాతావరణం చల్లగా ఉంటుంది. సెప్టెంబర్ 2020 నుంచి నవంబర్ వరకు ఆడే ఐపీఎల్ 2020ని ఓసారి పూర్తిగా పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది.

మొదటి అర్ధభాగంలో పరిస్థితులు వేడిగా ఉన్నాయి. మంచు తక్కువగా ఉన్నప్పుడు, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 77 శాతం మ్యాచ్‌లను గెలుచుకున్నాయి. అదే రెండో సగంలో జరిగిన మ్యాచ్‌లలో 77 శాతం మ్యాచ్‌లు ఛేజ్ చేసిన జట్లే గెలిచాయి. అదే సమయంలో అబుదాబి, షార్జాలో జరిగిన 18 మ్యాచ్‌ల్లో 15 ఛేజింగ్ చేస్తున్న జట్లే గెలిచాయి.

Also Read: T20 World Cup 2021: తలనొప్పిగా మారిన టీమిండియా ప్లేయింగ్ XI.. ఫుల్ ఫాంలో ఆటగాళ్లు.. ధోని-కోహ్లీ చూపు ఎవరిపైన ఉండనుందో?

T20 World Cup 2021: వార్మప్‌ మ్యాచుల్లో బయటపడ్డ కీలక విషయాలు.. ఆ ప్రశ్నకు సమాధానమే దొరకలే.. కోహ్లీ సేన ఏం చేయనుందో?

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ