T20 World Cup 2021: తలనొప్పిగా మారిన టీమిండియా ప్లేయింగ్ XI.. ఫుల్ ఫాంలో ఆటగాళ్లు.. ధోని-కోహ్లీ చూపు ఎవరిపైన ఉండనుందో?

India Playing XI: టీ 20 వరల్డ్ కప్ 2021 లో తమ రెండు వార్మప్ మ్యాచ్‌లను గెలిచిన టీమిండియా అద్భుతమైన ఫాంలో ఉంది. అయితో ఇంకా కొన్ని విషయాల్లో మాత్రం ధోని, కోహ్లీలకు కొన్ని సంశయాలు అలాగే మిగిలి ఉన్నాయి.

T20 World Cup 2021: తలనొప్పిగా మారిన టీమిండియా ప్లేయింగ్ XI.. ఫుల్ ఫాంలో ఆటగాళ్లు.. ధోని-కోహ్లీ చూపు ఎవరిపైన ఉండనుందో?
Dhoni Virat Kohli
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Oct 23, 2021 | 1:28 PM

ICC T20 World Cup 2021, IND vs PAK: టీ 20 వరల్డ్ కప్ 2021 కోసం టీమిండియా సన్నాహాలు మంచి ఫలితాలనే ఇచ్చాయి. వార్మప్ మ్యాచ్‌లలో ఈమేరకు అద్భుత ఫలితాలు కనిపించాయి. భారత్ మొదట ఇంగ్లండ్‌ని సులభంగా ఓడించింది. ఆ తర్వాత బుధవారం ఆస్ట్రేలియాపై కూడా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. భారత జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మెన్‌ల బ్యాట్‌ల నుంచి పరుగుల వరద పారింది. కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ 2021 ఫాంను ఇక్కడ కూడా కొనసాగించాడు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేసి శుభ సంకేతాలు అందిచాడు. బౌలింగ్‌లో కూడా భారత్ అనేక సానుకూల ఫలితాలను సాధించింది.

Virat Kohli Rohit Rahul

టీమిండియా ఆటగాళ్లందరూ పాకిస్తాన్‌తో మ్యాచుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్లేయింగ్ XIలో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక కెప్టెన్ కోహ్లీకి తలనొప్పిగా మారింది. ప్రపంచంలోని ప్రతి కెప్టెన్ అలాంటి సమస్యను కోరుకోవడం సాధారణమే.. అయినా ప్రస్తుతం భారత్ టీంతో మాత్రం మరింత కఠినంగా మారింది. విరాట్ కోహ్లీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్‌ను ఇప్పటికే ఫిక్స్ చేశాడు. రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నారు. అయితే సమస్య హార్దిక్ పాండ్య స్థానంలో నెలకొంది. హార్దిక్ పాండ్య రెండు వార్మప్ మ్యాచ్‌లలో ఎక్కువగా ఆడే అవకాశం రాలేదు. పాండ్యా తనకు వచ్చిన కొద్దిపాటి ఇన్నింగ్స్‌లో కష్టపడుతున్నట్లు కనిపించాడు. పాండ్యా తన పేలవమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడిపోయారు.

Hardik Pandya 3

విరాట్-ధోనీకి మరో సమస్య శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ రూంలో వచ్చింది. మొదటి వార్మప్ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ విఫలమయ్యాడు. భువీ తన 4 ఓవర్ల కోటాలో 54 పరుగులు ఇచ్చాడు. వికెట్ కూడా తీసుకోలేదు. కానీ, ఆస్ట్రేలియాపై మాత్రం ఘనంగా పునరాగమనం చేయడంతో మెంటార్ ధోనితోపాటు, కోహ్లీకి పెద్ద సమస్యగా మారింది. భువీ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. మొదటి మ్యాచ్‌లో భువీ విఫలమయ్యాక, శార్దూల్ ఠాకూర్‌ను జట్టులో ఉంచేలా చర్చ జరిగింది. శార్దుల్ బౌలింగ్ ఫామ్ అద్భుతంగా ఉంది. అతను లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడంతో అతని వైపే మొగ్గుచూపారు. పాండ్య ఫామ్‌లో లేనందున శార్దూల్ ఠాకూర్ కీలకంగా మారాడు. కానీ, భువి బాగా బౌలింగ్ చేయడంతో పాక్‌తో ఆడే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి చోటు దక్కనుందో పెద్ద ప్రశ్నగా మారింది.

Ashwin Kohli

టీమిండియాకు ఆర్ అశ్విన్ మూడో అతిపెద్ద సమస్యను సృష్టించాడు. మొదటి ప్లేయింగ్ ఎలెవన్ రేసులో అశ్విన్ చాలా దూరంలో కనిపించాడు. కానీ, వార్మప్ మ్యాచ్‌లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియాపై అశ్విన్ 8 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. టీమిండియా రెండో స్పిన్నర్‌గా అశ్విన్‌కు అవకాశం ఇస్తుందా లేక వరుణ్ చక్రవర్తిపైనే నమ్మకం ఉంచుతుందా అనేది చూడాలి. రాహుల్ చాహర్ కూడా రేసులో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై బాగా బౌలింగ్ చేసి, ప్లేయింగ్ XIలో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.

Bhuvneshwar Kumar

టీమిండియాకు నాలుగో పెద్ద సమస్య ఏమిటంటే, రెండు వార్మప్ మ్యాచ్‌లలో లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే, బౌలర్లు ఎలా రాణించేవారో తెలిసేది. కానీ, అలా జరగలేదు. ఒత్తిడిలో బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారో తెలిసేది. ఆ అవకాశం భారత్‌కు దక్కలేదు.

Also Read: T20 World Cup 2021: వార్మప్‌ మ్యాచుల్లో బయటపడ్డ కీలక విషయాలు.. ఆ ప్రశ్నకు సమాధానమే దొరకలే.. కోహ్లీ సేన ఏం చేయనుందో?

Watch Video: మెంటార్‌ ఆన్ డ్యూటీ.. రిషబ్ పంత్‌కు చెమటలు పట్టించిన మిస్టర్ కూల్.. మరో ధోనీ సిద్ధమయ్యాడంటూ నెటిజన్ల కామెంట్లు

News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం