T20 World Cup: స్క్విడ్ గేమ్ ఛాలెంజ్‌లో పాల్గొన్న భారత ఆటగాళ్లు.. ఎవరు గెలిచారంటే..
టీ 20 వరల్డ్ కప్‌కు ముందు బుధవారం నాడు ఐసీసీ షేర్ చేసిన ప్రమోషనల్ వీడియోలో నెట్‌ఫ్లిక్స్ బ్లాక్‌బస్టర్ 'స్క్విడ్ గేమ్'లో భాగంగా డాల్గోనా మిఠాయి ఛాలెంజ్‌ని ఇండియన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు స్వీకరించారు. ఈ ఛాలెంజ్‌లో క్యాండీలలో ఉన్న మిఠాయిని ఆకృతిని విచ్ఛిన్నం కాకుండా వేరు చేయాలి...
టీ 20 వరల్డ్ కప్‌కు ముందు బుధవారం నాడు ఐసీసీ షేర్ చేసిన ప్రమోషనల్ వీడియోలో నెట్‌ఫ్లిక్స్ బ్లాక్‌బస్టర్ ‘స్క్విడ్ గేమ్’లో భాగంగా డాల్గోనా మిఠాయి ఛాలెంజ్‌ని ఇండియన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు స్వీకరించారు. ఈ ఛాలెంజ్‌లో క్యాండీలలో ఉన్న మిఠాయిని ఆకృతిని విచ్ఛిన్నం కాకుండా వేరు చేయాలి. ఈ గేమ్‌లో నిర్ణీత సమయంలోపు చేయడంలో విఫలమైన లేదా మిఠాయిని పగలగొట్టిన ఆటగాళ్లు ఓడిపోతారు. ఇటీవలి కాలంలో ఈ గేమ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది.
ఈ గేమ్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా పాల్గొన్నారు. వరుణ్ చక్రవర్తి, సూర్యకుమార్, బుమ్రా ఆటలో విఫలం అవగా.. రోహిత్ శర్మ, మహ్మద్ షమీ క్యాండీలను పగులగొట్టి మిఠాయి ఆకృతి చెడకుండా వేరు చేసి గెలిచారు. ఈ వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ” నాడీ-రాకింగ్ గేమ్‌లో ఇండియా పరీక్షకు గురైంది. “ప్రపంచంలోని అత్యంత చర్చనీయాంశమైన షోలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన గేమ్‌తో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు పరీక్షించబడ్డారు” అని ఇది తెలిపింది.
భారత్ అక్టోబర్ 24న దుబాయ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. భారత జట్టు రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో గెలిచింది. వార్మప్ వార్మప్ మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాను ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇంగ్లాడ్‌తో జరిగిన ప్రాక్టిస్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ రాణించగా.. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రోహిత్, సూర్యకుమార్ బాగా ఆడారు.
View this post on Instagram