వీడు మామూలోడు కాదు.. క్రిస్ గేల్‌కు తమ్ముడే.. ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు బాదేశాడు..

ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టడం మీరు చూసి ఉంటారు. కానీ ఇక్కడ ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాలో జరిగిన..

వీడు మామూలోడు కాదు.. క్రిస్ గేల్‌కు తమ్ముడే.. ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు బాదేశాడు..
Harison
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 21, 2021 | 7:31 PM

ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టడం మీరు చూసి ఉంటారు. కానీ ఇక్కడ ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాలో జరిగిన క్లబ్ క్రికెట్‌లో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సామ్ హారిసన్ అనే ఆటగాడు ఈ విధ్వంసాన్ని సృష్టించాడు. ఒక్కసారి క్రిస్ గేల్, డివిలియర్స్, సెహ్వాగ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లను గుర్తు తెచ్చుకున్నాడో.? ఏంటో.? ప్రత్యర్ధి బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. అసలు మీరెం మాట్లాడుతున్నారు.? ఓవర్‌కు 6 బంతులైతే.. 8 సిక్సర్లు కొట్టడం ఏంటని అనుకుంటున్నారా.? ఆ కథేంటో తెలుసుకుందాం పదండి.!

Scorecard

ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్‌లో సోర్రెంటో డంక్రైగ్ సీనియర్ క్లబ్, కింగ్‌స్లే వుడ్‌వాలే సీనియర్ క్లబ్ మధ్య పెర్త్ వేదికగా తాజాగా ఓ మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన డంక్రైగ్ క్లబ్ 40 ఓవర్లకు 276 పరుగులు చేసింది. ఈ జట్టు ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు.. 39 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కింగ్‌స్లే వుడ్‌వాలే బౌలర్ బెన్నెట్ ఆ ఓవర్ వేయగా.. అందులో రెండు నో బాల్స్ కూడా పడ్డాయి. హారిసన్ మొత్తం 8 బంతులకు 8 సిక్సర్లు బాదాడు. ఇక రెండు నో బాల్స్ రూపంలో రెండు పరుగులు రాగా.. ఆ ఓవర్ మొత్తంలో బెన్నెట్ 50 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి..

Also Read:

ఆ ఇంటివారికి పెరట్లోకి వెళ్లాలంటే భయం.. తలకు హెల్మెట్‌ పెట్టాల్సిందే.. కారణం తెలిస్తే నవ్వాపుకోలేరు..

కంటైనర్‌ను ఓపెన్ చేసి చూడగా షాక్.. భయంతో ఒక్కసారిగా కళ్లు తేలేసారు.!

పెరుగు బెస్టా.. మజ్జిగ బెటరా.! ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

పెళ్లికాని అబ్బాయిలకు షాక్.. అక్కడి అమ్మాయిలు అలా డిసైడయ్యారట! విస్తుపోయే విషయాలు..