T20 World Cup: వారు టీ20ల్లో కాస్త బాగానే ఆడతారు.. కానీ ఒత్తిడిని ఎదుర్కొలేరు..

టీ20 వరల్డ్ కప్‎లో భాగంగా టీం ఇండియా తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‎తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‎పై ఇరు దేశాల మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు...

T20 World Cup: వారు టీ20ల్లో కాస్త బాగానే ఆడతారు.. కానీ ఒత్తిడిని ఎదుర్కొలేరు..
Final
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Oct 23, 2021 | 1:27 PM

టీ20 వరల్డ్ కప్‎లో భాగంగా టీం ఇండియా తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‎తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‎పై ఇరు దేశాల మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత్ పాక్ మ్యాచ్‎పై ఓ న్యూస్ ఛానల్‎తో మాట్లాడారు. పాకిస్తాన్‌ తరహాలో భారత్‌ ఎప్పుడూ సంచలన, భారీ ప్రకటనలు చేయదని అన్నాడు. వారితో పొలిస్తే భారతీయులు ఒత్తిడిని మెరుగ్గా ఎదుర్కొంటారని చెప్పాడు. ఈ ఫార్మాట్‌ ప్రకారం చూస్తే పాకిస్థాన్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. పాక్ ఆటగాళ్లు వన్డేల్లో కన్నా టీ20ల్లో కాస్త బాగానే ఆడతారని చెప్పాడు.

“ప్రపంచకప్‌లలో పాకిస్తాన్‌తో పోలిస్తే మనం మంచి స్థితిలో ఉన్నందున, ఈ మ్యాచ్‌లో భారత్ తక్కువ ఒత్తిడిలో ఉంటుంది.” అని సెహ్వాగ్ అన్నారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు పెద్ద ప్రకటనలు చేసే అలవాటును కలిగి ఉన్నారని కూడా సెహ్వాగ్ వివరించారు. ” ప్రస్తుతం జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్, ఇంగ్లాండ్‌ 2019 లో జరిగిన వరల్డ్ కప్‎లో పాకిస్తాన్‎పై ఇండియాదే పైచేయి సాధించిందని చెప్పాడు. 2003, 20211 ప్రపంచకప్‌లో తమపై ఒత్తిడి అంతగా లేదన్నాడు. ఎందుకంటే మేం టోర్నీలో పాక్‌ కన్నా మెరుగైన స్థితిలో ఉన్నామని చెప్పాడు.

పాకిస్థాన్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ సల్మాన్‌ భట్‌ విరుచుకుపడ్డాడు. వార్మప్‌ మ్యాచ్‌ల్లో యువకులకు, ఫామ్‌లో లేని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా ప్రధాన ఆటగాళ్లు ఆడటం ఏమిటని ప్రశ్నించాడు. పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, మాజీ కోచ్‌ మిస్సా ఉ​ల్‌ హక్‌ పాక్‌ క్రికెట్‌ బోర్డును ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశాడు.

Read Also.. T20 World Cup: స్క్విడ్ గేమ్ ఛాలెంజ్‎లో పాల్గొన్న భారత ఆటగాళ్లు.. ఎవరు గెలిచారంటే..