66 బంతుల్లో 96 పరుగులు.. కేవలం 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన 23 ఏళ్ల కుర్రాడు..
T20 World Cup Qualifier: ప్రస్తుతం టీ 20 ప్రపంచకప్ సీజన్ నడుస్తోంది. అక్టోబర్ 23 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.
T20 World Cup Qualifier: ప్రస్తుతం టీ 20 ప్రపంచకప్ సీజన్ నడుస్తోంది. అక్టోబర్ 23 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఈసారి కొన్ని యూరోపియన్, ఆఫ్రికన్ దేశాలు కూడా టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి. అలాగే వచ్చే ఏడాది జరగనున్న టీ 20 ప్రపంచకప్‌కు అర్హత సాధించే పోటీలు కూడా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా యూరోప్ రీజియన్ క్వాలిఫయర్‌లో డెన్మార్క్, జెర్సీల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 23 ఏళ్ల జెర్సీ బ్యాట్స్‌మన్ చెలరేగిపోయాడు. అతని T20 కెరీర్‌లో అతిపెద్ద స్కోరు సాధించాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన డెన్మార్క్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. డెన్మార్క్ కోసం దిలావర్ ఖాన్ లోయర్ ఆర్డర్‌లో 27 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డెన్మార్క్ వికెట్లు వరుసగా పడిపోవడవంతో భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. కేవలం జెర్సీ జట్టు ముందు 131 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన జెర్సీ లక్ష్యాన్ని సులువుగా చేధించింది. 23 ఏళ్ల బ్యాట్స్‌మన్ జోంటీ జెన్నర్ మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. 66 బంతుల్లో 96 పరుగులు చేశాడు.
తన తొలి టీ 20 సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో నిలిచాడు. 23 టీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌ల కెరీర్‌లో ఇది అతనికి నాలుగో అర్ధ సెంచరీ. జోంటీ జెన్నర్ 145.45 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అంటే అతని 96 ఇన్నింగ్స్‌లో అతను కేవలం 13 బంతుల్లో 56 పరుగులు చేశాడు. కేవలం 12 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. జోంటీ ఇన్నింగ్స్‌తో జెర్సీ జట్టు 12 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ జట్టు ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌లలో విజయం సాధించడం విశేషం.