India vs Pakistan: హోరాహోరీగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరు.. గెలుపోటముల నిష్పత్తి ఎలా ఉందంటే?

T20 World Cup 2021: టీ 20 ప్రపంచకప్‌ 2021 లో అక్టోబర్ 24 న భారత్ వర్సెస్ పాకిస్తాన్ తలపడనున్నాయి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇరు జట్లు ఒకరికొకరితో తలపడనున్నారు.

India vs Pakistan: హోరాహోరీగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరు.. గెలుపోటముల నిష్పత్తి ఎలా ఉందంటే?
India Vs Pakistan
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Oct 23, 2021 | 1:26 PM

T20 World Cup 2021, Ind vs Pak: టీ 20 ప్రపంచకప్‌ 2021 లో అక్టోబర్ 24 న భారత్ వర్సెస్ పాకిస్తాన్ తలపడనున్నాయి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇరు జట్లు ఒకరికొకరితో తలపడనున్నారు. అంతకు ముందు 2019 లో, భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. టీ 20 ప్రపంచకప్‌లో టైటిల్ కోసం ఈ రెండు జట్లు బలమైన పోటీదారులు. 2016 టీ 20 వరల్డ్ కప్ తర్వాత టీ 20 ఫార్మాట్‌లో భారత్, పాకిస్తాన్ రెండూ అత్యుత్తమ ప్రదర్శనలను అందించాయి. గత ఐదేళ్లలో ఇద్దరూ అత్యధిక విజయాలు నమోదు చేశారు. గెలుపు-ఓటముల నిష్పత్తిలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందంజలో ఉన్నప్పటికీ, పెద్ద జట్లు ఏవీ కూడా ఇండియా-పాకిస్థాన్‌కి దగ్గరగా లేవు. కాబట్టి టీ 20 వరల్డ్ కప్ 2021 ఫైనల్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ నిజంగా తలపడతాయా? లేదా ఈ జట్లలో ఒకటి ఖచ్చితంగా ఫైనల్ ఆడుతుందా? చూడాలి.

2016 టీ 20 ప్రపంచకప్ నుంచి టీమిండియా గెలుపు-ఓటముల నిష్పత్తి రెండుగా నమోదైంది. పాకిస్థాన్ స్కోరు 2.3. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్‌లను ఓడించడం చాలా కష్టమైన పని. కానీ, ఈ రెండు జట్లు ప్రపంచ కప్‌లో అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు. 2012 వరల్డ్ కప్‌కు ముందు దక్షిణాఫ్రికా 2010, 2012 మధ్య 16 మ్యాచ్‌ల్లో 11 గెలిచిందని చరిత్ర చెబుతోంది. ఈ జట్టు కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఎవరూ గెలవలేదు. కానీ దక్షిణాఫ్రికా సూపర్ -8 నుంచి బయటపడింది. ఆతరువాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 2012 లో వెస్టిండీస్ టైటిల్ గెలుచుకుంది. అయితే వారి గెలుపు-ఓటమి నిష్పత్తి టాప్ -8 జట్లలో రెండవ చెత్తదిగా నిలిచింది. 2012, 2016 మధ్య భారత్ అత్యధిక మ్యాచ్‌లను గెలిచింది. కానీ, సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయింది.

ప్రపంచ కప్‌కు ముందు దాదాపు అన్ని దేశాలు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయడం నిరంతరం కనిపించింది. తరచుగా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. వెస్టిండీస్ అతిపెద్ద ఉదాహరణగా నిలిచింది. ఈ జట్టు ఆట ప్రపంచకప్‌లో అద్భుతంగా ఉంది. 2010 టీ 20 ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్ 118 టీ 20 మ్యాచ్‌లు ఆడింది. క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, కీరాన్ పొలార్డ్ వీటిలో 26 మ్యాచుల్లో మాత్రమే కలిసి ఆడారు. వీటిలో 11 మ్యాచ్‌లు ఈ ఏడాదిలో జరిగాయి. ప్రపంచ కప్ జరిగిన సంవత్సరంలో ఈ జట్టు గెలుపు-ఓటమి నిష్పత్తి 1.55 గా ఉంది. ప్రపంచ కప్ జరిగిన సమయంలో గెలుపు-ఓటముల నిష్పత్తి 0.589 గా ఉంది. కానీ, ఇంగ్లండ్-పాకిస్తాన్ ఆట దీనికి భిన్నంగా ఉంటుంది. ఈ రెండు జట్లు ప్రపంచ కప్ లేని సంవత్సరాలలో అద్భుతాలు చేశాయి. కానీ, ప్రపంచ కప్ జరిగే ఏడాదిలో ఈ రెండు టీంల ఆట గాడి తప్పింది.

ఇక భారత్ గురించి మాట్లాడితే ప్రపంచ కప్ సంవత్సరాల్లో దాని ప్రదర్శన బాగుంటుంది. ప్రపంచ కప్ లేని సంవత్సరాల్లో టీమిండియా ఆట కొంచెం తక్కువగా ఉంటుంది. ప్రపంచ కప్ ఏడాదిలో భారత్ గెలుపు-ఓటముల నష్టాల నిష్పత్తిని 2.75 గా ఉంచింది. అయితే ప్రపంచ కప్ లేని ఏదాడిలో ఈ సంఖ్య 1.69 గా ఉంది.

ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియా వీలైనంత ఎక్కువ మంది ఆటగాళ్లను ప్రయత్నిస్తుంది. తద్వారా సరైన జోడీని కనుగొనే ప్రయత్నాలు చేసింది. కానీ, ఇప్పటికీ గత రెండు ప్రపంచకప్‌లలో జట్టు విజయం సాధించలేదు. ఈ జట్టు 2014,2016 ప్రపంచ కప్‌లలో ఓడిపోయింది. 2021లో కూడా ఆసీస్ జట్టు ఆందోళనలోనే ఉంది. గత ఐదేళ్లలో ఆస్ట్రేలియా 58 టీ 20 మ్యాచ్‌లు ఆడింది. కానీ, ఆరోన్ ఫించ్, ఆడమ్ జాంపా, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, అష్టన్ అగర్ మాత్రమే సగానికి పైగా మ్యాచ్‌లు ఆడారు. 38 మ్యాచ్‌లు ఆడిన అలెక్స్ కారీకి ప్రపంచ కప్ జట్టులో చోటు కూడా దక్కలేదు. అతని స్థానంలో జోష్ ఇంగ్లిస్‌తో భర్తీ చేశారు.

Also Read: T20 World Cup 2007: తొలి ప్రపంచ కప్ గెలిచిన భారత హీరోలు.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా.. ప్రస్తుత జట్టులో ఎంతమంది ఉన్నారంటే?

T20 World Cup: దుబాయ్‌లో బ్యాటింగ్.. అబుదాబి, షార్జాల్లో బౌలింగ్.. కీలకం కానున్న టాస్.. యూఏఈ పిచ్‌ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే.?