ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ రేసులో దీపిక, రణవీర్ జోడీ.! జెర్సీపై దినేష్ కార్తీక్ కౌంటర్..

ఐపీఎల్‌లో వచ్చే సీజన్ లో మరో రెండు కొత్త జట్లు దర్శనమివ్వనున్నాయి. ఇక మీదట 10 జట్లతో లీగ్ నిర్వహించాలని నిర్ణయించిన బీసీసీఐ..

ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ రేసులో దీపిక, రణవీర్ జోడీ.! జెర్సీపై దినేష్ కార్తీక్ కౌంటర్..
Ipl 2021

ఐపీఎల్‌లో వచ్చే సీజన్ లో మరో రెండు కొత్త జట్లు దర్శనమివ్వనున్నాయి. ఇక మీదట 10 జట్లతో లీగ్ నిర్వహించాలని నిర్ణయించిన బీసీసీఐ రెండు కొత్త జట్ల కోసం బిడ్డింగ్ ప్రక్రియ షురూ చేసింది. కాగా, ఈ రెండు జట్లలో ఒక జట్టు కోసం బాలీవుడ్ దంపతులు దీపిక పదుకొణే, రణవీర్ సింగ్ కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.

కొత్త ఫ్రాంచైజీలో దీపిక, రణవీర్‌ సింగ్‌తో పాటు ఓ ప్రముఖ బిజినెస్‌మేన్ కూడా భాగస్వామిగా ఉండేలా ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం. ఆ బిజినెస్ మేన్ అదానీ కుటుంబానికి చెందిన యువ వ్యాపారవేత్త అని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. రణవీర్ సింగ్, దీపిక పదుకునే కొనుగోలు చేయబోయే ఫ్రాంచైజీ జెర్సీ మాత్రం భలే ఇంటరెస్టింగ్‌గా ఉంటుందని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 స్టేజి మొదలు కానుంది. అక్టోబర్ 24వ తేదీన భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ దాయాదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.

Also Read:

ద్యేవుడా.! ఆ రైల్వే స్టేషన్ మన దేశంలోనే.. అక్కడికి వెళ్లాలంటే పాకిస్తాన్ వీసా అవసరం..

సింహాల గుంపు చుట్టుముడితే ఎట్టుంటుందో తెలుసా.? వైరల్ వీడియో మీకోసమే!

కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చాడు.. స్కాన్ చేసిన డాక్టర్లకు ఫ్యూజులు ఔట్.. అసలేమైందంటే!

బిస్కెట్లు ఎక్కువగా తింటున్నారా.? అయితే ఈ షాకింగ్ విషయాలు మీకోసమే..

Click on your DTH Provider to Add TV9 Telugu