- Telugu News Photo Gallery Viral photos attari the only railway station in india where pakistan visa is mandatory
ద్యేవుడా.! ఆ రైల్వే స్టేషన్ మన దేశంలోనే.. అక్కడికి వెళ్లాలంటే పాకిస్తాన్ వీసా అవసరం..
Unique Railway Station: ఇండియాలో అదొక ప్రత్యేక రైల్వే స్టేషన్. దేశ పౌరులు అక్కడికి వెళ్లాలంటే పాకిస్తాన్ వీసా ఉండాల్సిందే. ఆ రైల్వే స్టేషన్ ఎల్లప్పుడూ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పర్యవేక్షణలో ఉంటుంది. దాని వివరాలు ఇప్పుడు చూద్దాం..
Updated on: Oct 22, 2021 | 9:36 AM

భారతీయ రైల్వే దేశానికి జీవనాడిగా పరిగణిస్తారు. దేశంలోని ఒక చివర నుండి మరొక చివర వరకు ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి చేరుస్తూ ఉంటుంది. రైలు ప్రయాణం.. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటుంది. అయితే భారతీయ రైల్వేలో ప్రయాణించడానికి పాస్‌పోర్ట్, వీసా అవసరమని మీరెప్పుడైనా విన్నారా.? అవునండీ.! దేశంలోని పౌరులు ఓ ప్రత్యేక రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే పాకిస్తాన్ వీసా అవసరం. ఆ వివరాలు..

పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఏకైక ఇండియన్ రైల్వే స్టేషన్ అత్తారి(Attari). ఇక్కడికి భారతీయ పౌరులు వెళ్లాలంటే వీసా అవసరం. అది కూడా పాకిస్తాన్ వీసా తప్పనిసరి.

వీసా లేకుండా అక్కడికి వెళ్లి పట్టుబడితే.. అతడిపై విదేశీ చట్టం-14 కింద కేసు నమోదు చేస్తారు. ఈ అత్తారి(Attari) రైల్వే స్టేషన్ భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉండటం వల్ల ఎల్లప్పుడూ భద్రతా దళాల పర్యవేక్షణలో ఉంటుంది.

దేశంలోని అత్యంత వీవీఐపీ రైలు సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను అత్తారి రైల్వే స్టేషన్ నుంచే ప్రారంభించారు. ఇండియన్ రైల్వే నార్త్ జోన్‌కు సంబంధించిన ఈ ట్రైన్‌ను జూలై 22, 1976వ సంవత్సరంలో ప్రారంభించారు. ఇది ఓల్డ్ ఢిల్లీ జంక్షన్ నుంచి అత్తారి మధ్య నడుస్తుంది.

ఈ అత్తారి(Attari) రైల్వే స్టేషన్‌లో ట్రైన్ టికెట్ కొనుగోలు చేసిన ప్రతీ ప్రయాణీకుడి పాస్‌పోర్ట్ నెంబర్‌ను తీసుకుంటారు. ఆ తర్వాత వారి బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది.

ఏదైనా కారణంగా వల్ల అత్తారి రైల్వే స్టేషన్ నుండి బయల్దేరిన రైలు ఆలస్యమైతే.. దానిని భారత్, పాకిస్తాన్ రిజిస్టర్లలో నమోదు చేస్తారు. ఈ రైల్వే స్టేషన్‌ను పంజాబ్ పోలీసులు కాపలా కాస్తారు. ఇక్కడ ఫోటోలు తీయడంపై నిషేధం విధించారు.





























