- Telugu News Photo Gallery Viral photos Know Reason Why Sunday is a public holiday Check here All facts About Sunday Holiday
Sunday Holiday: ఆదివారం సెలవు ఎందుకొచ్చిందో తెలుసా.? దాని వెనుక పెద్ద హిస్టరీనే ఉంది.!
అందరికీ ఇష్టమైన ఆదివారం రోజున సెలవు ఎందుకొచ్చిందో తెలుసా.? రీజన్స్ ఏంటని అలోచించారా.? సోమవారం, మంగళవారం.. మిగిలిన రోజులు ఎందుకు సెలవులు కావు.!
Updated on: Oct 22, 2021 | 7:57 PM

విద్యార్ధులకు, ఉద్యోగస్తులకూ ఆదివారం పండగ రోజు అని చెప్పాలి. వీకెండ్‌లో వచ్చే ఆదివారం రోజున అందరికీ ఎక్కడలేని బద్ధకం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇక అందరికీ ఇష్టమైన ఆదివారం సెలవు ఎందుకొచ్చిందో తెలుసా.? ఎప్పుడైనా ఆలోచించారా.? దాని వెనుక పెద్ద హిస్టరీ ఉంది. అదేంటో తెలుసుకోండి.

ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO) ప్రకారం, ఆదివారాన్ని వారాంతపు చివరి రోజుగా పరిగణనలోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈరోజును సాధారణ సెలవు దినంగా ప్రకటించారు. ఇది 1986 సంవత్సరంలో ధృవీకరించబడింది. చరిత్ర చెప్పిందే జరుగుతుంది కాబట్టి.. క్రమేపీ.. ఆదివారం వారంలో చివరి రోజు గనుక పాఠశాలలు, కళాశాలలకు సెలవు దినంగా ప్రకటించబడింది. ఆ తర్వాత వరుసగా ఆదివారాలు సెలవు దినంగా పరిగణనలోకి తీసుకున్నారు.

ఆదివారం రోజున మాత్రమే సెలవు ఇవ్వడానికి మతపరమైన కారణాలు కూడా సాధ్యమే. రోమన్ కాథలిక్, ప్రొటెస్టంట్ క్రైస్తవులు ఆదివారం దేవుని రోజుగా భావిస్తారు. బైబిల్‌లో కూడా ఆదివారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత మూడవ రోజు తిరిగి బ్రతికాడని.. ఇక ఆ రోజు ఆదివారం కావడంతో.. ప్రతీ సంవత్సరం గుడ్ ఫ్రైడే అనంతరం వచ్చే ఆదివారాన్ని 'ఈస్టర్ సండే'గా క్రైస్తవులు జరుపుకుంటారు.

భారత్‌లో ఆదివారాన్ని సెలవుగా ఎలా ఎంచుకున్నారు.? బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు.. వివిధ రకాల పనులకు భారతీయులను కూలీలుగా చేసుకున్నారు. ఎంతో కొంత డబ్బులు రావడంతో మన పౌరులు కష్టపడి ఏడు రోజులు పని చేసేవారు. ఆ తర్వాత వారంలో కనీసం ఒక రోజైనా సెలవు ఉండాలని నిర్ణయానికి రాగా.. మేఘాజీ లోఖండే 'ఆదివారం సెలవు' అంటూ బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. ఈ ఉద్యమం ఎనిమిదేళ్లు సాగి మహా ఉద్యమంగా ఆవిర్భవించింది. చివరికి 1889లో ఈ మహా ఉద్యమానికి బ్రిటిష్ ప్రభుత్వం తలొగ్గి ఆదివారం సెలవుగా ప్రకటించింది.

ఆదివారం రోజున, బ్రిటీష్ ప్రజలు చర్చికి వెళ్లేవారు. కాబట్టి భారతదేశంలో ఆదివారం సెలవుగా ప్రసిద్ధి చెందింది. ఆదివారం భారత ప్రభుత్వం వారాంతపు సెలవుగా ఆదివారాన్ని పరిగణించలేదు. ఇది బ్రిటిష్ కాలం నుండి కొనసాగుతోంది.
