Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఐపీఎల్ పోటీలోకి మ‌రో బాలీవుడ్ జంట ఎంట్రీ..! షారుఖ్, ప్రీతిజింటాల‌కు గ‌ట్టి పోటీ..

IPL 2022: IPL 2021 వారం క్రితమే ముగిసింది. అప్పుడే కొత్త సీజ‌న్ గురించి హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. టి 20 ప్రపంచ కప్ జ‌రుగుతున్నా కూడా ఐపిఎల్ చర్చ ముగియడం లేదు.

IPL 2022: ఐపీఎల్ పోటీలోకి మ‌రో బాలీవుడ్ జంట ఎంట్రీ..! షారుఖ్, ప్రీతిజింటాల‌కు గ‌ట్టి పోటీ..
Ipl New Teams
Follow us
uppula Raju

|

Updated on: Oct 23, 2021 | 12:14 AM

IPL 2022: IPL 2021 వారం క్రితమే ముగిసింది. అప్పుడే కొత్త సీజ‌న్ గురించి హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. టి 20 ప్రపంచ కప్ జ‌రుగుతున్నా కూడా ఐపిఎల్ చర్చ ముగియడం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే 15 వ సీజన్ IPL కోసం స‌ర్వం సిద్దం చేసింది. మొదటి దశ సన్నాహాలు వచ్చే వారం పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా BCCI రెండు కొత్త ఫ్రాంచైజీలను ప్రకటించనుంది. IPL 2022 లో 8 జట్లకు బదులుగా 10 జట్ల మధ్య పోటీ ఉంటుంది. ఇప్పుడు ఆ రెండు కొత్త ఫ్రాంచైజీలను ఎవరు ద‌క్కించుకుంటార‌నే దానిపై పోటీ ఆస‌క్తిగా మారింది. అనేక పెద్ద కంపెనీలు ప్రాంచైజీల కోసం పోటీప‌డుతున్నాయి. ఇటీవల ఒక నివేదిక ప్రకారం.. బాలీవుడ్ సూపర్ క‌పుల్ కూడా ఈ రేసులో ఉంద‌ని తెలిసింది.

షారుఖ్ ఖాన్-జుహీ చావ్లా, ప్రీతి జింటా తరువాత బాలీవుడ్ నుంచి మరో ఇద్దరు ఐపిఎల్‌లో తమ ఉనికిని చాటుకోవడానికి సిద్ద‌మ‌య్యారు.’పవర్ కపుల్’ ప్రస్తుత కాలంలో ఇద్దరు పెద్ద సూపర్‌స్టార్లు రణవీర్ సింగ్‌, దీపికా పదుకొనే కొత్త ప్రాంచైజీ కోసం వేలం వేయబోతున్నారు. ఈ ఇద్ద‌రు కూడా సినిమాలతో పాటు క్రీడా అభిమానులు కూడా. దీపిక ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ ప్రకాష్ పదుకొనే కుమార్తె. ఆమె జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడింది. రణవీర్ ప్రీమియర్ లీగ్ నుంచి NBA వరకు గ్లోబల్ లీగ్‌లకు భారత బ్రాండ్ అంబాసిడర్.

సినిమాల తర్వాత క్రికెట్‌లో పోటీ అయితే దీపిక, రణ్‌వీర్ తమంతట తాము వేలం వేస్తున్నారా లేదా ఫ్రాంచైజీని కొనుగోలు చేయడానికి మరికొంత మంది వాటాదారులతో క‌లిసి పోటీ ప‌డుతారా అనేది స్పష్టంగా తెలియ‌లేదు. ఐపీఎల్‌తో బాలీవుడ్‌కు బలమైన అనుబంధం ఉంది. సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌, న‌టి జుహీ చావ్లా 2008 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ యజమానులు. అదే సమయంలో ప్రీతి జింటా, వాడియా గ్రూప్‌, డాబర్ గ్రూప్‌తో కలిసి 2008 లోనే పంజాబ్ కింగ్స్ (మొదట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్) ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి భాగస్వామిగా ఉంది. అటువంటి పరిస్థితిలో సినిమా పరిశ్రమ నుంచి ఐపిఎల్‌కు మూడో యజమాని రాబోతున్నారు. అక్టోబర్ 25 న రెండు కొత్త ఫ్రాంచైజీల గురించి దుబాయ్‌లో నిర్ణ‌యం తీసుకుంటారు.

రేసులో పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఈ రేసు అంత సులభం కాదు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు పోటీ ప‌డుతున్నాయి. అదానీ గ్రూప్, కోటక్ గ్రూప్, ఆర్‌పి-సంజీవ్ గోయెంకా గ్రూప్, అరబిందో ఫార్మా, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కంపెనీ టోరెంట్ ఫార్మా వంటి పెద్ద కంపెనీలు ఐపిఎల్ జట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇంకా ఫ్రాంచైజ్ టెండర్‌ను కొనుగోలు చేయడానికి ఇంగ్లాండ్‌లోని ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ యజమాని గ్లేజర్ కుటుంబానికి సంబంధించిన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒక మాజీ భారత క్రికెటర్ కూడా ఫ్రాంచైజీలో చిన్న వాటాను కొనుగోలు చేయాలని చూస్తున్నాడ‌ని తెలుస్తోంది.

Deepika Pilli: చిలకపచ్చ ఓణీతో పరువాల వల వేస్తున్న వయ్యారి భామ దీపికా పిల్లి..

Rashmi Gautam: నిషా కాళ్ళ రష్మీ .. అందాల ఆడబొమ్మ ఎంతబాగుంది ముద్దుగుమ్మ అంటూ పాటలు పడుతున్న కుర్రకారు

Janhvi Kapoor: కొంటె చూపుతో కుర్రాళ్ళగుండెల్లో బాణాలు గుచ్చుతున్న బ్యూటీ… జాన్వీ సొగసులు ఫిదా అవ్వాల్సిందే..