Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు షాకిచ్చిన బీసీసీఐ.. స్వదేశానికి చేరిన ఆ నలుగురు ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా?

ప్రపంచకప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ ముందు బీసీసీఐ షాకిచ్చింది. నలుగురు ఆటగాళ్లను భారత్‌కు పంపించింది.

T20 World Cup: భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు షాకిచ్చిన బీసీసీఐ.. స్వదేశానికి చేరిన ఆ నలుగురు ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా?
Teamindia
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Oct 23, 2021 | 1:26 PM

T20 World Cup: టీ 20 వరల్డ్ కప్ (ICC T20 World Cup 2021) లో భారత జట్టు తన మొదటి మ్యాచ్ ఇప్పుడు కొన్ని గంటల దూరంలో ఉంది. అక్టోబర్ 24 ఆదివారం దుబాయ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు దుబాయ్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇప్పటికే టీమిండియా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడింది. ఈ రెండింట్లో విజయం సాధించింది. అయితే, టీమిండియా తన మొదటి మ్యాచ్ ఆడటానికి ముందే, కొంతమంది బౌలర్లను భారతదేశానికి తిరిగి పంపించేసింది. ప్రపంచ కప్ కోసం సన్నాహాలకు సంబంధించి, నెట్ ప్రాక్టీస్ చేయడంలో సహాయపడటానికి భారత జట్టుతో పాటు చాలా మంది బౌలర్లు దుబాయ్‌లో ఆగిపోయారు. కానీ, ఇప్పుడు ఈ బౌలర్లలో నలుగురు భారతదేశానికి తిరిగి వచ్చారు. అయితే, దీని తర్వాత కూడా, విరాట్ కోహ్లీ బృందానికి నెట్స్‌లో సహాయపడేందుకు మరో నలుగురు బౌలర్లు ఉన్నారు. వారు మొత్తం టోర్నమెంట్ వరకు సన్నాహాల్లో సహాయం చేయనున్నారు.

యూఏఈలో కొన్ని రోజుల క్రితం ముగిసిన ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత, భారత జట్టుతో పాటు 8 మంది బౌలర్లు ‘నెట్ బౌలర్లు’గా ఎంపికయ్యారు. వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం, ఇప్పుడు స్పిన్నర్లు కర్ణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్, వెంకటేష్ అయ్యర్ దేశానికి తిరిగి వచ్చారు. ఈ నలుగురు ఆటగాళ్లు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమ తమ రాష్ట్రాల తరపున ఆడనున్నారు. వీరితో పాటు అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, లుక్మాన్ మెరివాలాలను కూడా దుబాయ్‌లోని బయో బబుల్‌లో జట్టుతో పాటు ఆగిపోయారు. ఈ నలుగురు బౌలర్లు చివరి వరకు జట్టుకు అండగా ఉంటారు.

భారత జట్టు తన సూపర్ -12 గ్రూపులో 5 మ్యాచ్‌లు ఆడవలసి ఉంది. ఆ తర్వాత జట్టు పురోగమిస్తే, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ ఆడే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్‌లన్నింటి మధ్య కేవలం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అటువంటి పరిస్థితిలో ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం ఉండదు. అందుకే వారిని వెనక్కి పంపాలని నిర్ణయించారు. బోర్డు సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, “టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత ఇన్ని నెట్ సెషన్‌లు ఉండవు. ఈ బౌలర్లు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఆడటం ద్వారా మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తారని జాతీయ సెలెక్టర్లు భావించారని” ఆయన తెలిపారు. ముస్తాక్ అలీ టి 20 టోర్నమెంట్ నవంబర్ 4 నుంచి ప్రారంభమవుతుంది.

స్పిన్నర్లను పంపారు.. పేసర్లను ఆపారు.. తిరిగి పంపిన నలుగురు బౌలర్లలో ముగ్గురు స్పిన్నర్లే ఉన్నారు, వెంకటేష్ అయ్యర్ మీడియం పేసర్. ప్రపంచకప్‌కు ఎంపికైన భారత జట్టులో ఇప్పటికే రాహుల్ చాహర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి రూపంలో నలుగురు ప్రధాన స్పిన్నర్లు ఉన్నారు. మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ రూపంలో నలుగురు పేసర్లు ఉన్నారు.

అయితే, టీంతో ఉన్న వారిలో నలుగురు బౌలర్లు కూడా వేగంగా బౌలింగ్ చేసేవారే కావడం విశేషం. ఇందులో ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్‌‌లు వేగవంతమైన బౌలింగ్‌తో జట్టుకు సాయంత్రం ప్రాక్టీస్‌లో సహాయపడనున్నారు. మరోవైపు, హర్షల్ పటేల్ నెమ్మదిగా బంతులను విసురుతాడు. హర్షల్ పటేల్‌కు వ్యతిరేకంగా యూఏఈలో ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. లుక్మాన్ మెరివాలా లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా ఉన్నాడు. టీమిండియాలో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ లేడు. పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో సహా భారత ప్రత్యర్థి జట్లలో చాలా మంది లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు ఉన్నారు. కాబట్టి మేరీవాలాను టీంతో ఉంచాలని నిర్ణయించారు.

Also Read:T20 World Cup 2021: ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్.. అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన పేటీఎం.. ఆ ఆఫర్ ఏంటంటే..

India vs Pakistan: హోరాహోరీగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరు.. గెలుపోటముల నిష్పత్తి ఎలా ఉందంటే?