Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: నేటి నుంచే రియల్ క్రికెట్ వార్.. తొలిపోరులో ఆస్ట్రేలియాతో తలపడనున్న సౌతాఫ్రికా..

T20 World Cup 2021: అత్యున్నత క్రికెట్‌ పోరుకు రంగం సిద్ధమైంది. గత వారమే ముగిసిన ఐపీఎల్‌ ఎప్పటిలాగే క్రికెట్‌ ప్రేమికులను అలరించగా.. ఇప్పుడు అంతకు మించిన వినోదం అందించనుంది

T20 World Cup 2021: నేటి నుంచే రియల్ క్రికెట్ వార్.. తొలిపోరులో ఆస్ట్రేలియాతో తలపడనున్న సౌతాఫ్రికా..
T20 World Cup
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 23, 2021 | 6:44 AM

T20 World Cup 2021: అత్యున్నత క్రికెట్‌ పోరుకు రంగం సిద్ధమైంది. గత వారమే ముగిసిన ఐపీఎల్‌ ఎప్పటిలాగే క్రికెట్‌ ప్రేమికులను అలరించగా.. ఇప్పుడు అంతకు మించిన వినోదం అందించనుంది టీ20 ప్రపంచ కప్ టోర్నీ. ఐదేళ్ల విరామం తరువాత జరుగుతున్న ఈ టీ20 ప్రపంకప్ కోసం నువ్వా.. నేనా.. అని తేల్చుకునేందుకు 12 దేశాల జట్లు సిద్ధమవుతున్నాయి. ఈనెల 17వ తేదీ నుంచి క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లతో అధికారికంగా టీ20 ప్రపంచకప్‌ ఆరంభమవగా.. సూపర్‌-12 పేరుతో నేటి నుంచి ప్రధాన మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆరేసి జట్లతో రెండు గ్రూపులు ఉండగా.. ఆ రెండు గ్రూపుల్లోని జట్ల మధ్య రసవత్తరమైన పోరు సాగనుంది. అయితే, ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం 8 జట్లు(భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు) ముందే సూపర్ 12కు చేరగా.. మిగిలిన నాలుగు జట్ల కోసం ఒమన్‌లో క్వాలిఫైడ్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఈ మ్యాచ్‌ల్లో గెలుపొందిన శ్రీలంక, బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్, నమీబియా జట్లు సూపర్‌ 12 చోటు దక్కించుకున్నాయి. ఇక నేటి నుంచి జరుగనున్న అసలైన పోరులో ఒక్కో గ్రూప్‌లోని ప్రతీ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత ఈ రెండు గ్రూప్‌ల నుంచి టాప్‌-2గా నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌కు చేరుతాయి. ఫైనల్ మ్యాచ్‌ నవంబరు 14న దుబాయ్‌లో జరుగనుంది.

టోర్నీ సాగుతుందిలా.. అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 22 వరకు జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో 8 జట్లు పోటీ పడ్డాయి. గ్రూప్ ‘ఎ’లో… ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, గ్రూప్ ‘బి’లో.. ఒమన్, పపువా న్యూగునియా, స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడ్డాయి. ఈ 8 దేశాలు మొత్తం 12 మ్యాచ్‌లు ఆడాయి. రెండు గ్రూపుల్లో టాప్ రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు శ్రీలంక, నమీబియా, స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 12 లీగ్‌కు చేరాయి.

సూపర్ 12 లో ఆడనున్న జట్లు ఇవే.. గ్రూప్ 1.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక గ్రూప్ 2.. భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్, స్కాట్ లాండ్, నమీబియా

రౌండ్ రాబిన్ పద్ధతిలో సాగనున్న పోటీలు.. సూపర్ 12 దశలో ప్రతీ జట్టు తన గ్రూప్‌ లోని ఇతర జట్లతో తలపడుతుంది. అంటే ప్రతీ జట్టు గ్రూపులో ఐదు మ్యాచ్ లు ఆడుతుంది. ఇలా రెండు గ్రూపుల్లో టాప్ టు లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్ కు చేరుతాయి. సెమీస్ 1 మ్యాచ్‌లో గ్రూప్ 1లో తొలి స్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్ 2 లో రెండో స్థానంలో నిలిచిన జట్టును ఢీ కొంటుంది. సెమీస్ 2 మ్యాచ్‌లో.. గ్రూప్ 2లో తొలి స్థానంలో నిలిచిన జట్టుతో గ్రూప్ 1లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్‌ నవంబర్ 14వ తేదీన దుబాయ్ వేదికగా జరుగనుంది.

పాయింట్లు ఇలా ఇస్తారు.. ప్రతీ గెలుపునకు.. 2 పాయింట్లు టై లేదా ఫలితం తేలకుంటే లేదా రద్దు: రెండు జట్లకు చెరొక పాయింట్ ఓటమి: పాయిట్లేమీ ఇవ్వరు సెమీ ఫైనల్ కు, ఫైనల్ కు రిజర్వ్ డే ఉంటుంది

ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ వేదికలు..(సూపర్ 12) 1.దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం- దుబాయ్ 2.షేక్ జయేద్ స్టేడియం- అబుదాబి 3.షార్జా క్రికెట్ స్టేడియం- షార్జా

Also read:

T20 World Cup 2021: ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్.. అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన పేటీఎం.. ఆ ఆఫర్ ఏంటంటే..

Silver Price Today: పసిడి బాటలోనే వెండి ధరలు.. స్వల్పంగా తగ్గిన రేట్లు.. ప్రధాన నగరాల్లో..

Beauty Tips: అందంగా ఉండటం కోసం ఇలా చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. తేడా వస్తే అందానికే ప్రమాదం..!