Silver Price Today: పసిడి బాటలోనే వెండి ధరలు.. స్వల్పంగా తగ్గిన రేట్లు.. ప్రధాన నగరాల్లో..

Latest Silver Price: బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే..

Silver Price Today: పసిడి బాటలోనే వెండి ధరలు.. స్వల్పంగా తగ్గిన రేట్లు.. ప్రధాన నగరాల్లో..
Silver Price Today
Follow us

|

Updated on: Oct 23, 2021 | 6:08 AM

Latest Silver Price: బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా శనివారం వెండి ధరలకు బ్రేక్ పడింది. కిలో వెండిపై రూ. 200 మేర తగ్గింది. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.65,300లుగా ఉంది. అయితే.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ.65,300 వద్ద కొనసాగుతోంది. * దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,300 లుగా ఉంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.69,800లుగా ఉంది. * బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.65,300 గా కొనసాగుతోంది. * కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.65,300 లుగా ఉంది. * కేరళలో కిలో వెండి ధర రూ.69,800గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,300 లుగా కొనసాగుతోంది. * విజయవాడలో వెండి ధర రూ. 69,800 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.69,800 లుగా ఉంది.

కాగా.. ఈ ధరలు శనివారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Kesineni Nani: అలక వీడిన కేశినేని నాని.. చంద్రబాబు దీక్షకు మద్దతు.. చాలా రోజుల తర్వాత ప్రత్యేక భేటీ..