AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kesineni Nani: అలక వీడిన కేశినేని నాని.. చంద్రబాబు దీక్షకు మద్దతు.. చాలా రోజుల తర్వాత ప్రత్యేక భేటీ..

Kesineni Nani meet Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో కొనసాగుతోంది. దీక్షకు మద్ధతుగా కార్యాలయానికి

Kesineni Nani: అలక వీడిన కేశినేని నాని.. చంద్రబాబు దీక్షకు మద్దతు.. చాలా రోజుల తర్వాత ప్రత్యేక భేటీ..
Kesineni Nani Meet Chandrab
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Oct 22, 2021 | 7:27 PM

Share

Kesineni Nani meet Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో కొనసాగుతోంది. దీక్షకు మద్ధతుగా కార్యాలయానికి చేరుకుని ఆ పార్టీ నేతలు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని కూడా చంద్రబాబు నిరసన దీక్షకు మద్దతునిచ్చారు. మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకుని ఎంపీ కేశినేని నాని.. చంద్రబాబు నిరసన దీక్షకు మద్దతు తెలిపారు. అనంతరం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కేశినేని చంద్రబాబుతో భేటి కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. ఏపీలో డ్రగ్స్‌కు రాచబాట వేశారని ధ్వజమెత్తారు. విద్యార్థులు, పిల్లలు ఎక్కడ డ్రగ్స్‌ బారిన పడుతారోననే భయం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో అరాచకాలను సహించమంటూ పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగ కేసులను పెట్టడం మానుకోవాలంటూ హితవు పలికారు. జగన్‌ను సంతోషపెట్టడానికి కొంతమంది గూండాగిరికి పాల్పడుతున్నారని.. డేట్‌.. ప్లేస్‌ మీరే చెప్పండి.. మా వాళ్లు కూడా వస్తారంటూ కేశినేని నాని హెచ్చరించారు.

కొద్దిరోజుల క్రితం చంద్రబాబు నాయుడిపై కేశినేని నాని తన వ్యతిరేకతను బహిరంగంగానే ప్రదర్శించారు. అంతేకాకుండా విజయవాడలోని తన కార్యాలయం వెలుపల గోడకు అమర్చిన చంద్రబాబు చిత్రపటాన్ని కూడా ఆయన తొలగించారు. ఈ క్రమంలో కేశినేని నాని పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:

Lakshmi Parvathi: అల్లుడి నిరాహార దీక్ష ప్రక్క నుండే వచ్చాను.. శిబిరం దగ్గర అదే మాట్లాడుకుంటున్నారు: లక్ష్మీ పార్వతి

Pawan Kalyan: తెరమీదకు కొత్త డిమాండ్.. కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెట్టాలన్న పవన్ కళ్యాణ్