TDP News: దాడి ఘటనపై టీడీపీ నేతల అంతర్మథనం.. చంద్రబాబు నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

పార్టీ ఆఫీస్‌పై దాడి ఘటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోంది? అధికార పార్టీకి ధీటుగా బదులిచ్చేందుకు రెడీ ఆవుతోందా? వెయిట్ అండ్ సీ ఫార్మూలాను ఫాలో అవుతుందా?

TDP News: దాడి ఘటనపై టీడీపీ నేతల అంతర్మథనం.. చంద్రబాబు నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
Ysrcp Vs Tdp
Follow us
Janardhan Veluru

| Edited By: Ravi Kiran

Updated on: Oct 22, 2021 | 7:27 PM

పార్టీ ఆఫీస్‌పై దాడి ఘటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోంది? అధికార పార్టీకి ధీటుగా బదులిచ్చేందుకు రెడీ ఆవుతోందా? వెయిట్ అండ్ సీ ఫార్మూలాను ఫాలో అవుతుందా? మెజార్టీ పార్టీ నేతలు తేల్చుకోవాలనే భావిస్తున్నారు. కానీ అధినే చంద్రబాబు నాయుడు మనసులో ఏముందన్న అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.

పార్టీ ఆఫీస్‌పై మంగళవారంనాటి దాడితో టీడీపీ ఉలిక్కిపడింది. దీనికి నిరసనగా బుధవారంనాడు రాష్ట్ర వ్యాప్త బంద్ చేపట్టింది టీడీపీ. మరుసటి రోజు(గురువారం) ఉదయం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గం.ల దీక్షకు పూనుకున్నారు.  ఇవాళ(శుక్రవారం) రాత్రి 8 గం.లతో చంద్రబాబు దీక్ష ముగియనుంది. అటు టీడీపీ నేతలు అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ నిలదీసింది. ఇప్పుడా పార్టీలో అంతర్మథనం మొదలైంది. దాడికి బదులివ్వాలా? అధికారం వచ్చే దాకా ఆగాలా అంటూ పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గంటసేపు కళ్లు మూసుకుంటే వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తామనే దాకా వెళ్లింది సిట్యువేషన్. చంద్రబాబు దీక్షాశిబిరంపై నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత, బోండా ఉమా ఘాటు వ్యాఖ్యలే చేశారు.

పార్టీ ఆఫీస్‌పై దాడితో ఓ వర్గం మొత్తం ఊగిపోతోంది. బదులు తీర్చుకోవాల్సిందేనని పట్టుబడుతోంది. మరో బ్యాచ్‌ చంద్రబాబు ఇప్పటికైనా మారాలంటోంది. ఇన్నాళ్లు ఓపిక పట్టింది చాలని, సహనాన్ని వదిలి సమరమే అనాల్సిన టైమ్‌ వచ్చిందంటున్నారు. ఇకపై యాక్షన్‌కి రియాక్షన్ ఉండి తీరాల్సిందేనని పట్టుబడుతోంది.

నిజానికి ఒక పార్టీ ఆఫీస్‌పై దాడి నెవర్ బిఫోర్ చాప్టర్‌. తిట్టుడు.. తిప్పికొట్టుడు ఎఫెక్ట్స్‌ వైసీపీ-టీడీపీల నుంచి నడుస్తూనే ఉన్నాయి. మరోవైపు ఎటాక్‌ ఎపిసోడ్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది టీడీపీ. మరీ కాసేపట్లో ముగిసే దీక్ష తర్వాత చంద్రబాబు తదుపరి పరిణామాలు, యాక్షన్‌ ప్లాన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది.

ఢిల్లీ వేదికగా వైసీపీ సర్కారుపై పోరాటం చేయాలన్నది కొందరు టీడీపీ నేతల యోచనగా తెలుస్తోంది. దీంతో సీన్ మొత్తం రేపటి నుంచి ఢిల్లీకి షిఫ్ట్ కానుంది.

Also Read..

Kesineni Nani: అలక వీడిన కేశినేని నాని.. చంద్రబాబు దీక్షకు మద్దతు.. చాలా రోజుల తర్వాత ప్రత్యేక భేటీ..

Huzurabad: హుజూరాబాద్ పొలిటికల్ లీగ్‌కు ఇక మిగిలింది జస్ట్ 7 డేస్.. హోరాహోరీగా ప్రచారపర్వం