AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad: హుజూరాబాద్ పొలిటికల్ లీగ్‌కు ఇక మిగిలింది జస్ట్ 7 డేస్.. హోరాహోరీగా ప్రచారపర్వం

Huzurabad By Elections: జస్ట్ 7 డేస్.. హుజురాబాద్ పొలిటికల్ లీగ్‌కు మిగిలున్న సమయమిది. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఈ వారం రోజులు మరో లెక్క. అందుకే పార్టీల్లో టెన్షన్ మొదలైంది.

Huzurabad: హుజూరాబాద్ పొలిటికల్ లీగ్‌కు ఇక మిగిలింది జస్ట్ 7 డేస్.. హోరాహోరీగా ప్రచారపర్వం
Huzurabad By Poll
Shaik Madar Saheb
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 23, 2021 | 1:45 PM

Share

Huzurabad By Elections: జస్ట్ 7 డేస్.. హుజురాబాద్ పొలిటికల్ లీగ్‌కు మిగిలున్న సమయమిది. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఈ వారం రోజులు మరో లెక్క. అందుకే ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ప్రధాన పార్టీల టాప్‌లీడర్లంతా చలో హుజురాబాద్ అంటున్నారు. అందరూ అక్కడే మకాం వేసి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంచనా వేస్తున్నారు. వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరో వారం రోజుల్లో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ మొత్తం హుజురాబాద్‌ వైపే చూస్తోంది. బైపోల్‌ హీట్‌ మామూలుగా లేదు. మూడు ప్రధాన పార్టీలు బరిలో నిలిచినా.. పోటీ మాత్రం TRS-BJP మధ్యే ఉంది. సిట్యుయేషన్ టఫ్‌గా ఉండటంతో ఉత్కంఠ పీక్‌ స్టేజ్‌కు చేరింది. ఓటర్ల నాడి అంతుచిక్కడం లేదు. అందుకే టాప్‌లీడర్లంతా హుజురాబాద్‌ షిఫ్ట్ అయ్యారు..

ఎన్నికలకు వారం టైమ్‌ ఉంది . కానీ ప్రచారానికి మిగిలింది 5 రోజులే. అందుకే హీట్‌ హైలెవల్‌కి చేరింది. నియోజకవర్గాన్ని ఇప్పటికే చుట్టేసింది అధికార TRS. మంత్రి హరీష్‌ రావు నెల రోజులుగా అక్కడే ఉంటూ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. మంత్రులు కొప్పుల, గంగుల కూడా ఫుల్‌ టైమ్‌ హుజురాబాద్‌కే కేటాయిస్తున్నారు. ఇక CM కేసీఆర్ సభ కోసం ప్లాన్‌ చేస్తోంది TRS. అయితే ఈసీ తాజా ఆంక్షలతో సభపై ఇంకా క్లారిటీ రాలేదు. ముందస్తుగా రోడ్‌షోలకు కూడా ప్లాన్ చేస్తోంది గులాబీ టీమ్. Byte పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఇక బీజేపీ నుంచి ఇప్పటి వరకు అన్నీ తానై నడిపించారు ఈటల. ఇప్పుడు స్టార్‌ క్యాంపేనర్స్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్లు జితేందర్‌రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు..మండలాల వారీగా క్యాంపేన్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అటు ఈటల సతీమణి జమున కూడా ఇంటింటికి వెళ్తున్నారు. ఢిల్లీ నుంచి మరికొందరు టాప్‌ లీడర్లను ప్రచారబరిలోకి దింపాలని భావిస్తోంది కమలదళం. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. BYTE కిషన్‌రెడ్డి

TRS, BJPతో పోలిస్తే కాంగ్రెస్ ప్రచారంలో వెనకబడింది. అయితే ఇప్పుడే కాస్త వేగం పెంచింది. పూర్తిస్థాయి టీమ్‌ను బరిలోకి దింపింది. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌, సీనియర్ నేత వీహెచ్ హుజురాబాద్ చేరుకున్నారు. అటు రేవంత్ కూడా రేపటి నుంచి 3 రోజులు మకాం వేయనున్నారు..అటు ముఖ్య నేతలంతా ఇప్పటికే మండలాల వారీగా ప్రచారం చేస్తున్నారు.

హుజురాబాద్‌ బైపోల్‌ ఈనెల 30న జరగనుంది. నవంబర్‌2న రిజల్ట్స్. మూడు పార్టీల నుంచి ప్రధాన లీడర్లంతా బరిలోకి దిగటంతో మాటల తూటాలు పేలుతున్నాయి. కౌంటర్లు-ఎన్‌కౌంటర్లతో రీసౌండ్ మోతెక్కిపోతోంది. మరి ఓటర్లు ఎవరిపై వైపు మొగ్గుతారన్నది సస్పెన్స్.

Also Read..

Huzurabad: టీఆర్‌ఎస్‌కు ‘గుర్తు’ టెన్షన్‌…మళ్లీ అదే రిపీట్‌ అవుతుందేమోనని ఆందోళన..

ఈ ఫోటోలోని చిన్నారి అబ్బాయిలకు డ్రీమ్ గర్ల్.. ఎన్నో బ్లాక్‌బస్టర్స్ అందుకుంది.. ఎవరో తెలుసా.!