Crime News: వీళ్లు మామూలోళ్లు కాదు..  స్కెచ్ వేశారు.. ఏటీఎం కాలిపోయిందంటూ రూ.అరకోటి కొట్టేశారు.. చివరకు..

ATM Robbery: వారంతా ఏటీఎంలల్లో నగదును ఏర్పాటు చేసే సిబ్బంది.. ఇంకెంతకాలం పనిచేసుకుంటాంలే అనుకున్నారంతా.. దీనికోసం మంచి స్కెచ్ వేశారు. ఎవరికీ

Crime News: వీళ్లు మామూలోళ్లు కాదు..  స్కెచ్ వేశారు.. ఏటీఎం కాలిపోయిందంటూ రూ.అరకోటి కొట్టేశారు.. చివరకు..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 22, 2021 | 7:03 PM

ATM Robbery: వారంతా ఏటీఎంలల్లో నగదును ఏర్పాటు చేసే సిబ్బంది.. ఇంకెంతకాలం పనిచేసుకుంటాంలే అనుకున్నారంతా.. దీనికోసం మంచి స్కెచ్ వేశారు. ఎవరికీ తెలియకుండా ఏటీఎం నగదు పెట్టే సిబ్బంది ఏకమయ్యారు. విడతల వారీగా ఏటీఎంలల్లో నగదును స్వాహా చేశారు. ఏకంగా అరకోటికిపైగానే నగదును దోచుకున్నారు. నమ్మించేందుకు ఏటీఎం కాలిపోయిందంటూ నాటకాలాడి చివరకు అడ్డంగా బుక్కయ్యారు. ఈ షాకింగ్ సీన్.. తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఏటీఎంలో నగదు ఏర్పాటు చేసే సిబ్బంది ఏకంగా రూ.52లక్షలు దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది ఏటీఎంలలో డబ్బు పెట్టకుండా విడతల వారీగా కాజేసినట్లు పోలీసులు తెలిపారు. చివరకు అందరినీ నమ్మించేందుకు ఏటీఎంను తగులబెట్టించి డబ్బు కాలిపోయిందని అధికారులకు సమాచారమిచ్చారని పేర్కొన్నారు.

యాక్సిస్ బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు.. ఈ ఘరానా మోసాన్ని చేధించాచారు. సిబ్బంది కావాలనే నాటకమాడినట్లు గుర్తించారు. ఈ కేసులో 8 మంది ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. వీరిలో ఐదుగురిని అరెస్ట్‌ చేయగా.. మరో ముగ్గు ముగ్గురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. అరెస్టు అనంతరం నిందితుల నుంచి రూ.6.7లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 23 లక్షలు విలువ చేసే రెండు ప్లాట్ల కాగితాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా జిల్లాలోని వివిధ ఏటీఎంల నుంచి రూ.52,59,500 నగదు దోచుకుందని.. విచారణ కొనసాగుతోందని మహబూబాబాద్ పోలీసులు వెల్లడించారు.

Also Read:

Yogi Adityanath: సీఎం పర్యటనలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్.. నలుగురు పోలీసుల సస్పెండ్.. యూపీలో కలకలం..

Harassment: ట్రైనింగ్‌ కోసం వచ్చిన బాలికతో కోచ్‌ అసభ్యకర ప్రవర్తన…కేసు నమోదు చేసిన పోలీసులు..