ఈ ఫోటోలోని చిన్నారి అబ్బాయిలకు డ్రీమ్ గర్ల్.. ఎన్నో బ్లాక్‌బస్టర్స్ అందుకుంది.. ఎవరో తెలుసా.!

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోయింది. సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి సెలబ్రిటీలకు, ఫ్యాన్స్‌కు మధ్య దూరం..

ఈ ఫోటోలోని చిన్నారి అబ్బాయిలకు డ్రీమ్ గర్ల్.. ఎన్నో బ్లాక్‌బస్టర్స్ అందుకుంది.. ఎవరో తెలుసా.!
Throwback Pic

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోయింది. సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి సెలబ్రిటీలకు, ఫ్యాన్స్‌కు మధ్య దూరం తగ్గుతూ వస్తోంది. చాలామంది సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటూ తమ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. కొన్నిసార్లయితే ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తూ తమ సినిమాల అప్‌డేట్స్, రిలీజ్ డేట్ విషయాలను పంచుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. తమ అభిమాన నటీనటుల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తే.. ఫ్యాన్స్ క్షణాల్లో వాటిని వైరల్ చేసేస్తారు. ఇప్పటికే కీర్తి సురేష్, సాయి పల్లవి, రష్మిక లాంటి హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఇదే కోవలో ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అదేంటో చూద్దాం..

దీపిక చిన్ననాటి ఫోటోను షేర్ చేసిన భర్త రణవీర్…

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

ముసిముసి నవ్వులు చిందిస్తూ ఫోటోకి ఫోజిచ్చిన ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ తన సత్తాను చాటుకుంది. వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్స్ దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అంతేకాకుండా బాలీవుడ్ ఖాన్ త్రయంతో కూడా సినిమాలు చేసింది. ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది. ఆమెవరో కాదు దీపిక పదుకునే.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

కన్నడ ఫిల్మ్ ‘ఐశ్వర్య’తో సినీ రంగ ప్రవేశం చేసిన దీపిక పదుకునే.. ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘ఓం శాంతి ఓం’ సినిమాలో నటించి.. ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ చిత్రంతోనే దీపికకు ‘బెస్ట్ డెబ్యు ఫెమల్’ ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కింది. ‘లవ్ ఆజ్ కల్’, ‘రేస్ 2’, ‘కాక్‌టైల్’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’ వంటి సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంది. 2018లో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌, దీపిక పదుకునే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న బై-లింగ్యువల్ చిత్రంలో దీపిక పదుకునే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే హిందీలో నాలుగు చిత్రాలను చేస్తోంది.

Also Read:

ద్యేవుడా.! ఆ రైల్వే స్టేషన్ మన దేశంలోనే.. అక్కడికి వెళ్లాలంటే పాకిస్తాన్ వీసా అవసరం..

సింహాల గుంపు చుట్టుముడితే ఎట్టుంటుందో తెలుసా.? వైరల్ వీడియో మీకోసమే!

కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చాడు.. స్కాన్ చేసిన డాక్టర్లకు ఫ్యూజులు ఔట్.. అసలేమైందంటే!

బిస్కెట్లు ఎక్కువగా తింటున్నారా.? అయితే ఈ షాకింగ్ విషయాలు మీకోసమే..

Click on your DTH Provider to Add TV9 Telugu