Huzurabad: టీఆర్‌ఎస్‌కు ‘గుర్తు’ టెన్షన్‌…మళ్లీ అదే రిపీట్‌ అవుతుందేమోనని ఆందోళన..

ఏ రాజకీయ పార్టీకైనా గుర్తు అనేది ప్రధాన ఆయుధం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అభ్యర్థి పేరు కంటే పార్టీ గుర్తే ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో....

Huzurabad: టీఆర్‌ఎస్‌కు 'గుర్తు' టెన్షన్‌...మళ్లీ అదే రిపీట్‌ అవుతుందేమోనని ఆందోళన..
Trs
Follow us
Shaik Madar Saheb

| Edited By: Anil kumar poka

Updated on: Oct 23, 2021 | 1:46 PM

ఏ రాజకీయ పార్టీకైనా గుర్తు అనేది ప్రధాన ఆయుధం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అభ్యర్థి పేరు కంటే పార్టీ గుర్తే ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలనుకుంటోన్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రస్తుతం ఓ పార్టీ గుర్తు గుబులు రేబుతోంది. అదే ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ పోటీ చేస్తున్న రోలింగ్‌ పిన్‌(రొట్టెల పీట, కర్ర). ఇది చూడడానికి అచ్చం టీఆర్‌ఎస్‌ కారు గుర్తును పోలీ ఉంటుంది. దీంతో ఇది తమ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావితం చూపుతుందేమోనని టీఆర్‌ఎస్‌ నేతలు తలలు పట్టుకుంటున్నారు. శ్రీకాంత్‌ ఇలా ఎన్నికల్లో పోటీచేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ప్రధాన రాజకీయ పార్టీల విధి విధానాలు నచ్చని శ్రీకాంత్‌ గత మూడేళ్లలో రాష్ట్రంలో జరిగిన ఆరు ఉప ఎన్నికల్లో పోటీ చేయడం గమనార్హం. గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న శ్రీకాంత్‌ ప్రస్తుతం హుజురాబాద్‌ ఉప ఎన్నికలోనూ బరిలోకి దిగుతున్నాడు. ఈ క్రమంలోనే ఎలక్షన్‌ కమిషన్‌ అతనికి రోలింగ్‌ పిన్‌ గుర్తు కేటాయించింది.

గత ఫలితాలు ఏం చెబుతున్నాయంటే…! గత ఏడాది దుబ్బాకలో హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం 1470 ఓట్ల మెజార్టీతో టీఆర్‌స్‌పై విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికలో చపాతీ రోలర్‌(స్వతంత్ర్య అభ్యర్థి బండారు నాగరాజు)కు ఏకంగా 3, 570 ఓట్లు రావడం విశేషం. నాగరాజుకు టీఆర్‌ఎస్‌ కారు గుర్తును పోలిన చపాతీ రోలర్‌ గుర్తును కేటాయించడం కూడా తమ ఓటమికి ఒక కారణమని అప్పట్లో టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పుకొచ్చారు. ఇక 2019 భువనగిరి లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లోనూ కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్‌కు భారీగా ఓట్లు పడ్డాయి. ఆ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో రోలింగ్‌ పిన్‌ గుర్తు కారణంగా హుజురాబాద్‌లోనూ ప్రతికూల ఫలితం వస్తుందేమోనని టీఆర్‌ఎస్‌ తెగ కంగారు పడుతోంది.

Also Read:

Huzurabad – Kishan Reddy: ఈటెలను ఓడించడానికి వందల కోట్లు: టీవీ9 తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

BJP Bandi Sanjay: దళిత బంధుపై యాదాద్రిలో తేల్చుకుందాం.. టీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరిన బండి సంజయ్..

Etela Rajender: అంబేద్కర్ చౌరస్తా దగ్గర చర్చకు రండి.. TRS నేతలకు ఈటల సవాల్