Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: అందంగా ఉండటం కోసం ఇలా చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. తేడా వస్తే అందానికే ప్రమాదం..!

Beauty Tips: అందంగా ఉండటం ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. అందుకే చాలా మంది తమ అందాన్ని, ముఖారవిందాన్ని మెరుగు పరుచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

Beauty Tips: అందంగా ఉండటం కోసం ఇలా చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. తేడా వస్తే అందానికే ప్రమాదం..!
Beauty Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 23, 2021 | 6:05 AM

Beauty Tips: అందంగా ఉండటం ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. అందుకే చాలా మంది తమ అందాన్ని, ముఖారవిందాన్ని మెరుగు పరుచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కాస్త డబ్బున్నోళ్లు అయితే లేజర్ ట్రీట్‌మెంట్లు, ఇతరాలు చేయించుకుని గ్లామరస్‌గా కనిపిస్తుంటారు. సామాన్యులు హోమ్ రెమెడీస్‌తో, అందుబాటులో ఉన్న ఫేస్ క్రీమ్స్, లోషన్స్, సోప్స్ వాడుతూ ముఖారవిందాన్ని పెంచుకునేందుకు చిన్నపాటి యుద్ధమే చేస్తుంటారు. అయితే, అందంగా కనిపించేందుకు అతి ప్రయోగాలు చేస్తే అసలుకే మోసం అయ్యే అవకాశం ఉందని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అవునండీ.. అందరికంటే అందంగా ఉండాలని అడ్డమైనవన్నీ ముఖానికి అప్లై చేస్తే.. ఉన్న అందం కూడా పోయే ప్రమాదం ఉందంటున్నారు. మరి ఎలాంటి ప్రయోగాలు చేయొద్దు.. ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం..

అన్ని రకాల ఆర్టిఫిషల్ క్రీమ్స్ చర్మానికి సరిపోవని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అందుకే అతిగా ఫేస్‌ క్రీమ్స్, లోషన్స్, సోప్స్ వాడకూడదంటున్నారు. వీటిని వాడటం వల్ల ముఖ చర్మం నిర్జీవంగా మారి కాంతిహీనంగా మారే ప్రమాదం ఉందంటున్నారు. ఇంకా.. అతిగా మేకప్ వేసుకోవడం కూడా ప్రమాదకరం అని చెబుతున్నారు. మేకప్ కోసం వాడే క్రీమ్స్, ఫౌడర్లలో హానీకరమైన రసాయనాలు ఉంటాయని, అవి చర్మానికి తీరని నష్టాన్ని కలిగిస్తాయట. పార్టీలు, ఫంక్షన్‌ల నుంచి వచ్చిన వెంటనే మేకప్ తీసేసి.. మంచి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక వ్యాయామం, దూరప్రయాణాలు చేసేటప్పుడు మేకప్ అస్సలు వేసుకోకూడదట. ఇంకా చాలామంది మేకప్ వేసుకునేప్పుడు కళ్లకు ఐషాడో, ఐలైనర్, మస్కారా, కాజల్ వంటివి వేసుకుంటారు. కానీ, మేకప్ తీసిన తరువాత కళ్లకు వేసుకున్న వాటిని క్లీన్ చేసుకోవడం మర్చిపోతారు. దాంతో కళ్లకు పెనుప్రమాదం తప్పదని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. కంటి వద్ద ముడతలు ఏర్పడి అందవికారంగా మారే ఛాన్స్ ఉందంటున్నారు. చర్మానికి తగినంత తేమను అందించడానికి నైట్ క్రీమ్‌ను అప్లై చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగని అధిక మోతాదులో వాడకూడదు. పెదలాకు వాడే లిప్‌ స్టిక్స్‌ కూడా చాలా డేంజర్ అట. లిప్‌స్టిక్స్ ఎక్కువగా వాడటం వల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అందుకే లిప్స్‌ని తరచుగా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు.

అయితే, చర్మ రక్షణ కోసం.. సహజసిద్ధ సౌందర్యం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. ముఖారవిందం పెరగాలంటే శరీరానికి తగినంత నిద్ర అవసరం. యోగా ఆసనాలు చేయడం అలవాటు చేసుకోవాలి. మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి. పోషకాలు ఎక్కువ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. అందం కోసం సహజ సిద్ధమైన ఫేస్‌ప్యాక్‌లను వాడాలని, తద్వారా చర్మ సౌందర్యం సహజసిద్ధంగా మెరుగవుతుందని చెబుతున్నారు.

Also read:

TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ తుది విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తివివరాలివే..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Wife and Husband: మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. అది చూసిన భార్య చితిక్కొట్టుడు కొట్టిందంతే..