Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Effect: మీరు ‘టీ’ తాగేముందు నీళ్లు తాగుతారా..! అసలు నిజాలు తెలుసుకోండి..

Tea Effect: చాలామందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇది తాగనిదే ఏ పనికూడా ప్రారంభించరు. కొంతమంది రోజుకు ఎన్ని టీలు తాగుతారో

Tea Effect: మీరు 'టీ' తాగేముందు నీళ్లు తాగుతారా..! అసలు నిజాలు తెలుసుకోండి..
Tea
Follow us
uppula Raju

|

Updated on: Oct 22, 2021 | 10:23 PM

Tea Effect: చాలామందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇది తాగనిదే ఏ పనికూడా ప్రారంభించరు. కొంతమంది రోజుకు ఎన్ని టీలు తాగుతారో తెలియదు. అయితే టీ ద్వారా ఆరోగ్యానికి మంచి, చెడు రెండు ఉన్నాయి. టీ లో రకారకాలు ఉంటాయి. అయితే మీరు ప్రతిరోజు టీ తాగే అలవాటు ఉంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

1. టీకి ముందు నీళ్లు ఎందుకు తాగాలి వాస్తవానికి రాత్రంతా శరీరానికి నీరు అందదు. దీని కారణంగా శరీరం నిర్జలీకరణం చెందుతుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం నిద్రలేచిన తర్వాత నీరు మాత్రమే తాగాలి. తర్వాత టీ తాగితే బెటర్.

2. ఉదయం టీ ఎంతవరకు మంచిది? ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం టీ తాగే ముందు వేడి లేదా సాదా నీరు తాగాలి. దీని తర్వాత టీ తాగండి. లేదంటే టిఫిన్ చేసి టీ తాగండి.

3. వేడి తక్కువగా ఉన్న టీ వేడి వేడి టీ తాగడం వల్ల నికోటినామైడ్ మొత్తం పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలాగే టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగకూడదు. ఇది స్లో పాయిజన్‌ లాంటిది. వీలైనంత వరకు తాజా టీ మాత్రమే తాగండి.

4. మీకు టీ ఎక్కువగా తాగే అలవాటు ఉంటే గ్రీన్ టీ తాగితే బెటర్. ఎందుకంటే ఇందులో ఉండే ఆంటీ యాక్సిడెంట్లు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. అలాగే ఆరోగ్యానికి ఎక్కువగా హాని ఉండదు.

5. పేగులపై చెడు ప్రభావం ఎక్కువగా టీ ప్రభావం పేగులపై ఉంటుంది. ఇది మలబద్ధకానికి కారణమవుతుంది. క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల ఎముకలు పెళుసుగా మారతాయి. రక్త నాళాలు కుంచించుకుపోతాయి. రక్తపోటు పెరుగుతుంది. ఊబకాయం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిరంతరం టీ తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి.

Beetroot Juice: ఉదయం పూట బీట్‌రూట్ జ్యూస్‌కి మించినది లేదు..! ఎందుకో తెలుసుకోండి..

Maa Elections 2021: మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత విష్ణు తొలి నిర్ణయం.. మహిళల భద్రత కోసం..

Suhas’s Family Drama: సుహాస్ హీరోగా క్రైం థ్రిల్లర్ “ఫ్యామిలీ డ్రామా”.. ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సినిమా.. ఎప్పుడంటే