T20 World Cup: టీ 20 ప్రపంచకప్‌తో అరంగేట్రం చేసిన టీమిండియా క్రికెటర్లు.. ప్రస్తుత టీంలో ఎంతమంది ఉన్నారో తెలుసా?

తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత్ భయాందోళనలు సృష్టించింది. ఈ టోర్నమెంట్ తరువాత ప్రతీసారి భారత్ టైటిల్ కోసం పోటీదారుగా ఉంది. కానీ, రెండోసారి ట్రోఫీని గెలవలేకపోయింది.

|

Updated on: Oct 23, 2021 | 7:24 AM

టీ20 ప్రపంచకప్ 2021లో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈసారి టైటిల్ గెలవడానికి టీమిండియా బలమైన పోటీదారుగా నిలిచింది. పరుగుల యంత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ టీంను నడిపించనున్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్‌తో భారత్ చాలా బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి రాణిస్తున్నారు. ఈసారి భారత్ తరపున ఎక్కువమంది యువకులు కనిపిస్తున్నారు. అయితే వీరంతా కనీసం ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ అయినా ఆడినవారే కావడం విశేషం. కానీ, టీ20 ప్రపంచ కప్‌తో తమ అంతర్జాతీయ టీ20 కెరీర్‌ను ప్రారంభించిన భారతీయ తారలు ఎందరో ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం.

1 / 14
యూసుఫ్ పఠాన్- తుఫాన్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన యూసఫ్ పఠాన్.. 2007 టీ 20 ప్రపంచకప్ ఫైనల్‌లో అరంగేట్రం చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ గాయపడడంతో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే యూసుఫ్ ఈ మ్యాచులో నిరాశపరచలేదు. వేగంగా 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత బౌలింగ్ కూడా చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత యూసుఫ్ చాలా ఏళ్ల పాటు భారత్ తరపున ఆడాడు.

2 / 14
రోహిత్ శర్మ- ప్రస్తుతం భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ 2007 టీ20 ప్రపంచ కప్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఇంగ్లండ్‌తో మొదటి మ్యాచ్ కూడా ఆడాడు. అయితే ఇందులో రోహిత్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ తరువాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ అర్ధశతకం సాధించాడు. ఇక ఫైనల్‌లో అజేయంగా 30 పరుగులతో నిలిచాడు. అప్పటి నుంచి రోహిత్ భారత క్రికెట్‌లో భాగం అయ్యాడు.

3 / 14
జోగిందర్ శర్మ - 2007 టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ చివరి ఓవర్ బౌలింగ్ చేసి, భారత్ విజయానికి నాంది పలికాడు. 2007 టీ 20 ప్రపంచకప్ నుంచే జోగిందర్ శర్మ అరంగేట్రం చేశాడు. అతను తన మొదటి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడాడు. ఇందులో ఖరీదైన బౌలర్‌గా మారాడు. నాలుగు ఓవర్లలో 57 పరుగులు సమర్పించుకున్నాడు.

4 / 14
Yuvraj

Yuvraj

5 / 14
గౌతమ్ గంభీర్ - 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్‌లో పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ సాధించాడు. గౌతం గంభీర్ కూడా స్కాట్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.

6 / 14
ఆర్‌పీ సింగ్- ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ భారతదేశాన్ని ప్రపంచ ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. 2007 టీ 20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌పీ సింగ్ టీ 20 లో అరంగేట్రం చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఆర్పీ సింగ్ 12 వికెట్లు తీశాడు. వికెట్లు తీయడంలో అతను రెండో స్థానంలో నిలిచాడు.

7 / 14
రాబిన్ ఉతప్ప- ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 2007 ప్రపంచ కప్ నుంచి టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. రాబిన్ ఉతప్ప కూడా స్కాట్లాండ్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. టోర్నీలో అతను భారత్‌కు చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో పాటు అద్భుతమైన ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు.

8 / 14
ప్రజ్ఞాన్ ఓజా- ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తన టీ 20 కెరీర్‌ను టీ 20 వరల్డ్ కప్ నుంచే ప్రారంభించాడు. 2009లో బంగ్లాదేశ్‌తో ఇంగ్లండ్‌లో ఆడిన టోర్నమెంట్‌లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో ప్రజ్ఞాన్ ఓజా నాలుగు వికెట్లు పడగొట్టాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

9 / 14
వినయ్ కుమార్- కుడి చేతి కర్ణాటక ఫాస్ట్ బౌలర్ టీ20 కెరీర్ కూడా ప్రపంచ కప్‌తో ప్రారంభమైంది. అతను 2010 ప్రపంచ కప్‌తో అరంగేట్రం చేశాడు. శ్రీలంక ముందు తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు.

10 / 14
పీయూష్ చావ్లా- ఈ లెగ్ స్పిన్నర్ బౌలర్ 2010 టీ20 ప్రపంచకప్‌లోనే  అరంగేట్రం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో పీయూష్ చావ్లా అరంగేట్రం చేశాడు. ఇందులో ఒక వికెట్ పడగొట్టాడు.

11 / 14
మురళీ విజయ్- భారత్ తరఫున ఓపెనర్ పాత్ర పోషించిన మురళీ విజయ్ కూడా 2010 టీ20 ప్రపంచకప్‌తో అరంగేట్రం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచులో అరంగేట్రం చేశాడు. ఇందులో మురళీ విజయ్ 48 పరుగులు చేశాడు. ఈ మ్యాచులో భారతదేశం తరపున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

12 / 14
మోహిత్ శర్మ - ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ టీ20 అరంగేట్రం కూడా ప్రపంచ కప్ నుంచే జరిగింది. 2014లో బంగ్లాదేశ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో మోహిత్ శర్మ ఓ వికెట్ తీశాడు.

13 / 14
మహమ్మద్ షమీ- అంతర్జాతీయ టీ 20 లో ఈ ఆటగాడి అరంగేట్రం ప్రపంచ కప్ ద్వారా జరిగింది. 2014లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ అరంగేట్రం చేశాడు. ఇందులో షమీ ఒక వికెట్ తీశాడు. మహ్మద్ షమీ ఇప్పటికీ భారత్ తరఫున ఆడుతున్నాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రధాన బౌలర్‌గా అవతరించాడు.

14 / 14
Follow us