- Telugu News Photo Gallery Cricket photos t20 world cup controversy zimbabwe pulled out of the tournament in 2009 here is the detail
T20 World Cup: ఈ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంది.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
ఎన్నో సంచలనాలకు కేరాఫ్ టీ20 ప్రపంచకప్. బ్యాట్స్‌మెన్లు ఆధిపత్యాన్ని చలాయించే ఈ టోర్నీలో బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్రను మాత్రమే పోషిస్తారని చెప్పొచ్చు. ఫ్యాన్స్‌కు కావల్సినంత వినోదాన్ని పంచిపెట్టే.. ఈ టోర్నీ చుట్టూ అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారి మనం ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్తే..
Updated on: Oct 22, 2021 | 9:31 PM

యూఏఈ వేదికగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం మొదటి రౌండ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ ఆదివారం నుంచి సూపర్-12 స్టేజి మొదలు కానుంది. ఇదిలా ఉంటే గత ప్రపంచకప్ టోర్నీలను ఒక్కసారి చూసుకుంటే.. 2009లో పెద్ద వివాదం చోటు చేసుకుంది. అంతా సిద్దం.. టోర్నమెంట్‌లో ఈ జట్టు పాల్గొంటుందని అనుకునేలోపు అర్ధాంతరంగా తప్పుకుంది. ఆ జట్టు మరేదో కాదు జింబాబ్వే

2009 టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే ఆడలేదు. బ్రిటన్ ప్రభుత్వం, జింబాబ్వే మధ్య నెలకొన్న రాజకీయ వివాదమే దీనికి కారణం. చివరికి ఐసీసీ రంగంలోకి దిగడంతో ప్రాబ్లమ్‌కు సొల్యూషన్ దొరికింది.

2009లో, జింబాబ్వే ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది, కానీ రాజకీయ కారణాల వల్ల, ఆ జట్టు బ్రిటన్‌లో అడుగు పెట్టలేదు. దీనితో బ్రిటన్ సర్కార్ జింబాబ్వేను టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అనుమతించలేదు.

నివేదికల ప్రకారం, బ్రిటన్ ప్రభుత్వం జింబాబ్వే ఆటగాళ్లకు వీసాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఆ తర్వాత ఐసీసీ ఈ విషయంపై జోక్యం చేసుకోవడంతో.. సమస్య సద్దుమణిగింది.

జింబాబ్వేకు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వడమే కాకుండా సభ్యత్వాన్ని కూడా తిరిగి ఇచ్చేందుకు ఐసీసీ అంగీకరించింది. జింబాబ్వే క్రికెట్ బోర్డు అధికారులు ఈ ఒప్పందానికి అంగీకారం తెలిపారు. దీనితో జింబాబ్వే జట్టు 2009 టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనలేదు.





























