Jio Phone Next: దీపావళికి రానున్న అత్యంత చౌకైన జియో స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?

Jio Phone Next: జియో టెలికాం ప్రకటించిన అత్యంత చౌక స్మార్ట్‌ జియో నెక్ట్స్‌ను ఈ దీపావళికి లాంచ్‌ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు..

Narender Vaitla

|

Updated on: Oct 22, 2021 | 2:55 PM

అత్యంత తక్కువ ధరలో స్మార్ట్‌ ఫోన్‌ తీసుకొచ్చే లక్ష్యంతో జియో టెలికాం.. ‘జియోఫోన్‌ నెక్ట్స్‌’ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.

1 / 6
నిజానికి ఈ ఫోన్‌ను గడిచిన వినాయకచవితికి లాంచ్‌ చేయాలని సంస్థ భావించింది. కానీ అనుకోని కారణాలతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయలేకపోయింది. దీంతో దీపావళికి మార్కెట్లోకి తీసుకురావడానికి సర్వం సిద్ధం చేసింది.

2 / 6
ఈ ఫోన్‌ ధర రూ. 3,500 నుంచి రూ. 5,000 మధ్యలో ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జియో నెక్ట్స్‌ ఫీచర్లు సంబంధించి తాజాగా సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.

3 / 6
లీక్‌ అయిన సమాచారం మేరకు ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారిత గో ఎడిషన్‌తో పనిచేయనుందని సమాచారం. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 215 క్యూఎమ్‌215 ప్రాసెసర్‌ను తీసుకొచ్చారని తెలుస్తోంది.

4 / 6
4జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో 2జీబీ ర్యామ్‌ ఉండనుంది. ఇక స్క్రీన్‌ విషయానికొస్తే.. 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇవ్వనున్నారు.

5 / 6
రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీ కెమెరా కూడా 13 మెగా పిక్సెల్స్‌తో అందించనున్నారని సమాచారం. అంతేకాకుండా ఆటోమెటిక్‌ రీడ్‌-అలౌడ్‌ ఆఫ్‌ స్క్రీన్‌ టెక్స్ట్‌, లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది.

6 / 6
Follow us