Telugu News » Photo gallery » IRCTC website will not work from October 23rd 11:45 PM to October 24th 5 AM in some Indian Railway zones know about this
IRCTC: ఆరోజు కొన్ని జోన్లలో ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ కొంత సేపు పనిచేయదు.. ఎందుకు.. ఎప్పుడో తెలుసుకోండి!
KVD Varma |
Updated on: Oct 22, 2021 | 1:36 PM
రైల్వే వెబ్‌సైట్ నిర్వహణ పనిలో భాగంగా అప్పుడప్పుడు రైల్వే వెబ్ సైట్ ను కొంత సేపు నిలిపివేస్తారు. అదేవిధంగా రేపు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ కొంత సేపు కొన్ని జోన్లలో పనిచేయదు. దీనిగురించి పూర్తిగా తెలుసుకోండి
Oct 22, 2021 | 1:36 PM
భారతీయ రైల్వేస్ ఒక ప్రత్యేక హెచ్చరిక చేసింది. కొన్ని రైల్వే జోన్ ల పరిధిలో ప్రయాణీకుల రిజర్వేషన్ వ్యవస్థ కొంతకాలం అందుబాటులో ఉండదని తూర్పు రైల్వే నివేదించింది. తూర్పు రైల్వే విడుదల చేసిన సమాచారం ప్రకారం, కోల్‌కతాలోని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పిఆర్‌ఎస్) డేటా సెంటర్‌లో డౌన్‌టైమ్ యాక్టివిటీ కారణంగా ఈ సర్వీస్ అందుబాటులో ఉండదు.
1 / 5
డౌన్ టౌన్ కార్యకలాపం రేపు అంటే అక్టోబర్ 23 న రాత్రి 11.45 నుండి అక్టోబర్ 24 ఉదయం 5 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇంటర్నెట్ బుకింగ్, విచారణ సహా అన్ని సేవలు తూర్పు రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ కోస్ట్ సెంట్రల్ రైల్వే, ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే అలాగే ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో పనిచేయవు.
2 / 5
ఈ సమయంలో, నిర్వహణ పని జరుగుతుంది. దీని కారణంగా ఈ సేవలు నిలిచిపోతాయి. నిర్వహణకు సంబంధించి అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. దీనికి సంబంధించిన సమాచారం జారీ చేయడం ద్వారా రైల్వే ప్రజలకు దీనిని తెలియచేస్తుంది. నిర్వహణ కారణంగా ఎక్కువ పనిని ప్రభావితం కాకుండా ఉండటం కోసం ఇటువంటి పనులు అర్ధరాత్రి తర్వాత నిర్వహించి పూర్తి చేస్తారు.
3 / 5
ఆగస్టు నెలలో, ఇదే విధమైన నోటిఫికేషన్ దక్షిణ రైల్వే కోసం ఇచ్చారు. తద్వారా ప్రజలు తమ పనిని ఈ సమయానికి ముందే పూర్తి చేస్తారు. నిర్వహణ సమయంలో IRCTC వెబ్‌సైట్ ఓపెన్ కాదు. ఈ కారణంగా టికెట్ బుకింగ్ సాధ్యం కాదు.
4 / 5
కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి రైల్వే తన సిస్టమ్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి చిన్న సమయ వ్యవధిని చేస్తుంది. కోల్‌కతాలోని పిఆర్‌ఎస్ డేటా సెంటర్‌లో డౌన్‌టైమ్ యాక్టివిటీ సమయంలో సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తారు. దీనిద్వారా ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలు అందించే వీలుంటుంది.