T20 World Cup 2024: అడియాశలు.. కేఎల్ రాహుల్‌తో సహా టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కని స్టార్ ప్లేయర్లు వీరే

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడాడు. 3 అర్ధసెంచరీలతో మొత్తం 378 పరుగులు చేశాడు. అయితే జట్టు ఎంపికకు రాహుల్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. రాహుల్ స్థానంలో రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లను వికెట్ కీపర్లుగా ఎంపిక చేశారు.

T20 World Cup 2024: అడియాశలు.. కేఎల్ రాహుల్‌తో సహా టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కని స్టార్ ప్లేయర్లు వీరే
Team India
Follow us

|

Updated on: Apr 30, 2024 | 6:52 PM

జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియాను ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం (ఏప్రిల్ 29) బీసీసీఐ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో క్లాస్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కు చోటు దక్కలేదు. వన్డే ప్రపంచ కప్ లోనూ, ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్‌లో రాహుల్ అద్భుతమైన ప్రదర్శన చేసినా ఎంపిక కాకపోవడంపై ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడాడు. 3 అర్ధసెంచరీలతో మొత్తం 378 పరుగులు చేశాడు. అయితే జట్టు ఎంపికకు రాహుల్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. రాహుల్ స్థానంలో రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లను వికెట్ కీపర్లుగా ఎంపిక చేశారు. అలాగే, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లను టాపార్డర్ బ్యాటర్లుగా జట్టులోకి తీసుకున్నారు.

రాహుల్ కు మొండి చేయి..

నలుగురు ఆటగాళ్లను రిజర్వ్ ప్లేయర్‌లుగా ఉంచారు. ఈ జాబితాలో శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్ బ్యాటర్లు కాగా, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ బౌలర్‌లుగా ఉన్నారు. కనీసం ఈ జాబితాలోనూ కేఎల్ రాహుల్‌కు అవకాశం దక్కలేదు. ఇక టీమిండియా డబుల్ సెంచరీ వీరుడు, ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ కు కూడా టీ20 ప్రపంచ కప్ జట్టులో మొండి చేయ్యి చూపించారు. గిల్ కు కేవలం ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్ల లిస్టులో స్థానం కల్పించారు.

ఇవి కూడా చదవండి

రాహుల్ ఇన్ స్టా గ్రామ్ స్టోరీ..

వీరికి నిరాశే..

అలాగే చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, దినేశ్ కార్తీక్ లు కూడా టీ20 ప్రపంచకప్ పై ఆశలు పెట్టుకున్నారు. కానీ వీరి ఆశలు ఆడియాలశలయ్యాయి.

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్‌ దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

ట్రావెలింగ్‌ రిజర్వ్‌ ఆటగాళ్లు:

శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..