AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: తొలి మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ ఫెయిల్.. కట్‌చేస్తే.. చివరి రెండు వన్డేలకు భారత జట్టు ఇదే..?

Australia vs India, 1st ODI: భారత జట్టుకు కీలకమైన ఇద్దరు మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా చివరి రెండు వన్డేలకు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సిరీస్‌కు ముందు, రోహిత్, విరాట్ మార్చి 2025లో తమ చివరి మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే.

IND vs AUS: తొలి మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ ఫెయిల్.. కట్‌చేస్తే.. చివరి రెండు వన్డేలకు భారత జట్టు ఇదే..?
Rohit Virat Ind Vs Aus 1st
Venkata Chari
|

Updated on: Oct 19, 2025 | 11:29 AM

Share

Australia vs India, 1st ODI: భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఈరోజు (అక్టోబర్ 19) ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా స్టాండ్-ఇన్ కెప్టెన్ మిచెల్ మార్ష్ భారత్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తొలిసారి జట్టులోకి తీసుకోగా, ఈ మ్యాచ్ మధ్యలో ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు వన్డేలకు టీం ఇండియాను ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ 15 మంది ఆటగాళ్లకు జట్టులో అవకాశం ఇచ్చారు.

శుభ్‌మాన్ కెప్టెన్-అయ్యర్ వైస్ కెప్టెన్..

యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మిగిలిన రెండు వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ గిల్‌కు అగ్ని పరీక్ష అవుతుంది. ఎందుకంటే, అతను మొదటిసారి వన్డేకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

అయితే, గిల్ గతంలో టెస్ట్ కెప్టెన్సీ పాత్రను నిర్వహించాడు. వన్డేల్లో ఆ ఫామ్‌ను పునరావృతం చేయాలనుకుంటున్నాడు. గిల్‌తో పాటు, 30 ఏళ్ల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

అయ్యర్ తొలిసారిగా ఏ ఫార్మాట్‌లోనైనా టీమ్ ఇండియాకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయ్యర్ ఇటీవలి ఫామ్, అద్భుతమైన కెప్టెన్సీ కారణంగా వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు.

విరాట్-రోహిత్ కూడా చోటు దక్కించుకున్నారు..

భారత జట్టుకు కీలకమైన ఇద్దరు మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా చివరి రెండు వన్డేలకు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సిరీస్‌కు ముందు, రోహిత్, విరాట్ మార్చి 2025లో తమ చివరి మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే.

కానీ, ఈ ఇద్దరు ఆటగాళ్ళు పెర్త్ వన్డే ద్వారా అంతర్జాతీయ వేదికపైకి తిరిగి వచ్చారు. రెండవ, మూడవ వన్డే మ్యాచ్‌లలో రోహిత్ శర్మ ఓపెనింగ్‌గా, విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో ఆడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఇద్దరూ తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. రోహిత్ 8, కోహ్లీ 0 పరుగులకు పెవిలియన్ చేరారు.

రెండు వన్డే మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయి?

ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ అక్టోబర్ 19 ఆదివారం ప్రారంభమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ప్రస్తుతం పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరుగుతుండగా, రెండవ మ్యాచ్ అక్టోబర్ 23న అడిలైడ్ ఓవల్ స్టేడియంలో జరుగుతుంది.

టీమిండియా, కంగారూల మధ్య మూడో, చివరి మ్యాచ్ అక్టోబర్ 25న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. కెప్టెన్ గిల్ తొలిసారిగా వన్డేల్లో టీం ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నందున ఈ సిరీస్ అతనికి అగ్ని పరీక్ష అవుతుంది.

ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టు..

భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సింగ్, సిరాజ్, అర్ష్‌దీప్, సిరాజ్, అర్ష్‌దీప్ కృష్ణ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
2026 మకరరాశి వారికి ఎలా ఉండనుందో తెలుసా? కెరీర్, ఆర్థిక పరిస్థితి
2026 మకరరాశి వారికి ఎలా ఉండనుందో తెలుసా? కెరీర్, ఆర్థిక పరిస్థితి
మరో వారంలో అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్ 2026.. సిద్ధమేనా?
మరో వారంలో అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్ 2026.. సిద్ధమేనా?
ఉన్న చోటే ఉంటూ నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు!
ఉన్న చోటే ఉంటూ నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు!
రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!