AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్ వేసి వెళ్లగొట్టారు.. కట్‌చేస్తే.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో టీ20ల్లో విశ్వరూపం

Abhimanyu Easwaran: అభిమన్యు ఈశ్వరన్‌ను మొదట వేలం జాబితా నుంచి తప్పించినప్పటికీ, అతని ఇటీవలి ఫామ్ చూసి కొన్ని ఐపీఎల్ జట్లు ఆసక్తి చూపినట్లు సమాచారం. ముఖ్యంగా టాప్ ఆర్డర్‌లో నిలకడగా ఆడుతూనే, అవసరమైనప్పుడు భారీ షాట్లు కొట్టగల సామర్థ్యం అతనికి కలిసొచ్చే అంశం.

టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్ వేసి వెళ్లగొట్టారు.. కట్‌చేస్తే.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో టీ20ల్లో విశ్వరూపం
Abhimanyu Easwaran
Venkata Chari
|

Updated on: Dec 15, 2025 | 8:02 AM

Share

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న ఈ వేలానికి సంబంధించిన ఫైనల్ జాబితాలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తొలుత ప్రకటించిన షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయిన బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్, ఫ్రాంచైజీల ప్రత్యేక విజ్ఞప్తి మేరకు చివరి నిమిషంలో వేలం జాబితాలో చేర్చారు. కేవలం టెస్టు ప్లేయర్‌గా ముద్రపడిన ఈశ్వరన్, ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సిక్సర్ల మోత..

సాధారణంగా క్లాసిక్ బ్యాటర్‌గా పేరున్న అభిమన్యు ఈశ్వరన్, ఈసారి T20 ఫార్మాట్‌లో తన విశ్వరూపం చూపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 సీజన్‌లో అతడు నమోదు చేసిన గణాంకాలు ఫ్రాంచైజీలను ఆలోచనలో పడేసాయి.

ఈ సీజన్‌లో ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో ఈశ్వరన్ ఏకంగా 266 పరుగులు సాధించాడు. 152.00 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో అతను మొత్తం 11 సిక్సర్లు బాదడం విశేషం.

రికార్డు సెంచరీ: పంజాబ్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో కేవలం 66 బంతుల్లోనే 130 పరుగులు (8 సిక్సర్లు, 13 ఫోర్లు) చేసి అజేయంగా నిలిచాడు. ఇది అతని T20 కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచింది.

ఫ్రాంచైజీల ఆసక్తికి కారణం ఇదేనా?

అభిమన్యు ఈశ్వరన్‌ను మొదట వేలం జాబితా నుంచి తప్పించినప్పటికీ, అతని ఇటీవలి ఫామ్ చూసి కొన్ని ఐపీఎల్ జట్లు ఆసక్తి చూపినట్లు సమాచారం. ముఖ్యంగా టాప్ ఆర్డర్‌లో నిలకడగా ఆడుతూనే, అవసరమైనప్పుడు భారీ షాట్లు కొట్టగల సామర్థ్యం అతనికి కలిసొచ్చే అంశం. ఇన్నాళ్లు కేవలం రెడ్-బాల్ (టెస్ట్) క్రికెటర్‌గా మాత్రమే చూడబడిన ఈశ్వరన్.. తనపై ఉన్న ఆ ముద్రను చెరిపేసుకునేందుకు ఈ ప్రదర్శన దోహదపడింది.

వేలం వివరాలు..

తేదీ: డిసెంబర్ 16, 2025

వేదిక: అబుదాబి

బేస్ ప్రైస్: రూ. 30 లక్షలు

దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించినా ఐపీఎల్‌లో మాత్రం ఈశ్వరన్‌కు ఇప్పటివరకు సరైన అవకాశం రాలేదు. అయితే, ఈసారి తన అద్భుతమైన ఫామ్‌తో ఏదో ఒక జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ లేదా ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు బ్యాకప్ ఓపెనర్‌గా అతనిపై కన్నేసే అవకాశం ఉంది.