AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కోహ్లీ, రోహిత్ భవిష్యత్‌పై గంభీర్ కీలక వ్యాఖ్యలు.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏమన్నాడంటే?

Virat Kohli and Rohit Sharma Future: టీమిండియా ICC T20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ స్థాయిలో పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. రాబోయే కాలంలో టీమిండియా 2025లో ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2027లో వన్డే ప్రపంచకప్ ఆడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఎన్ని రోజులు ఆడతారు, వీరి విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచనేంటి అన్నది కూడా చర్చనీయాంశమవుతోంది.

Video: కోహ్లీ, రోహిత్ భవిష్యత్‌పై గంభీర్ కీలక వ్యాఖ్యలు.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏమన్నాడంటే?
Virat Kohli Rohit Sharma
Venkata Chari
|

Updated on: Jul 22, 2024 | 12:04 PM

Share

Virat Kohli and Rohit Sharma Future: టీమిండియా ICC T20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ స్థాయిలో పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. రాబోయే కాలంలో టీమిండియా 2025లో ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2027లో వన్డే ప్రపంచకప్ ఆడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఎన్ని రోజులు ఆడతారు, వీరి విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచనేంటి అన్నది కూడా చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో వీరికి సంబంధించి టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లాన్ ఏమిటనే విషయం ఇప్పుడు వెల్లడైంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు తదుపరి వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆడటం చూడగలమంటూ గుడ్ న్యూస్ చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే..

టీమ్ ఇండియా కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనే ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల భవిష్యత్తు గురించి ప్రశ్నించారు. ఈ మేరకు గౌతీ స్పందిస్తూ.. “విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది. వారు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. ఏ జట్టుకైనా ఇలాంటి వాళ్లు ఉండాలి. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ, ఆస్ట్రేలియా సిరీస్ ఉంది. వారి ఫిట్‌నెస్ బాగా ఉంటే, వారు 2027 ప్రపంచ కప్ వరకు కూడా ఆడగలరు” అంటూ చెప్పుకొచ్చాడు.

భారతదేశంలో, సీనియర్ ఆటగాళ్ళ భవిష్యత్తుపై తరచుగా ప్రశ్నలు తలెత్తుతాయని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలో కూడా అదే కనిపిస్తోంది. అయితే, వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ బాధ్యతలు స్వీకరిస్తాడని ఇటీవల బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. మరోవైపు విరాట్ ప్లేస్ కూడా ఇప్పుడు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒక దశాబ్దానికి పైగా టీమ్ ఇండియాను నడిపించారు. అయితే, 2027 ODI ప్రపంచ కప్ నాటికి విరాట్‌కి 38, రోహిత్‌కి 40 ఏళ్లు రానున్నాయి.

ఈ కారణంగా వీరిద్దరు తదుపరి వన్డే ప్రపంచ కప్‌లో ఆడటం గురించి ఇంకా ఏమీ నిర్ణయించలేదు. కానీ, ఇప్పుడు కోచ్ గౌతం గంభీర్ తన స్టాండ్‌ను స్పష్టం చేశాడు. వారిద్దరూ తమ ప్రదర్శనను కొనసాగించి, వారి ఫిట్‌నెస్ బాగుంటే 2027 వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆడటం చూడవచ్చు అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్, రోహిత్ అభిమానులకు ఓ శుభవార్త వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..