Hardik Pandya: హార్దిక్ పాండ్యాలో లోపం అదే.. అందుకే కెప్టెన్‌గా చేయలేదు: క్లారిటీ ఇచ్చిన గంభీర్, అగార్కర్

Gautam Gambhir Press Conference Hardik Pandya Captaincy: శ్రీలంక పర్యటనకు టీ20, వన్డే జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 జట్టుకు సూర్య కుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వకపోవడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేశాడు. కెప్టెన్సీ రేసు నుంచి హార్దిక్ పాండ్యా ఎందుకు తప్పుకున్నాడో, అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను జట్టుకు కెప్టెన్‌గా ఎందుకు నియమించారో క్లారిటీ ఇచ్చాడు.

Hardik Pandya: హార్దిక్ పాండ్యాలో లోపం అదే.. అందుకే కెప్టెన్‌గా చేయలేదు: క్లారిటీ ఇచ్చిన గంభీర్, అగార్కర్
Hardik Pandya Ajith Agarkar
Follow us

|

Updated on: Jul 22, 2024 | 11:22 AM

Gautam Gambhir Press Conference Hardik Pandya Captaincy: శ్రీలంక పర్యటనకు టీ20, వన్డే జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 జట్టుకు సూర్య కుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వకపోవడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేశాడు. కెప్టెన్సీ రేసు నుంచి హార్దిక్ పాండ్యా ఎందుకు తప్పుకున్నాడో, అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను జట్టుకు కెప్టెన్‌గా ఎందుకు నియమించారో క్లారిటీ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ విషయంలో సమస్య ఉందని అందుకే అతడిని కెప్టెన్‌గా చేయలేదంటూ అగార్కర్ పేర్కొన్నాడు.

నిజానికి శ్రీలంక పర్యటనకు భారత టీ20 జట్టును ప్రకటించినప్పుడు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా అనౌన్స్ చేయలేదు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించారు. టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇలాంటి సమయంలోనూ హార్దిక్‌ను కెప్టెన్‌గా చేయకుండా, సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీని అప్పగించారు. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.

హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై డౌట్ – అజిత్ అగార్కర్..

ప్రధాన కోచ్ అయిన తర్వాత, గౌతమ్ గంభీర్ మొదటిసారి విలేకరుల సమావేశానికి వచ్చాడు. ఈ సమయంలో అజిత్ అగార్కర్ కూడా అతనితో ఉన్నాడు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేయకపోవడంపై సెలక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్‌ను ప్రశ్నించగా.. సూర్యకుమార్ యాదవ్‌కు అర్హుడు. కాబట్టే, టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా ఉన్నాడు. అన్ని మ్యాచ్‌లలో ఆడగల ఆటగాడిని కెప్టెన్‌గా నియమించాలనుకుంటున్నాం. హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ అతనికి పెద్ద సవాల్‌గా మారింది. అందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

జులై 27 నుంచి శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందుకోసం సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా చేయడంతో పాటు వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌పై విశ్వాసం వ్యక్తమైంది. అయితే, రోహిత్ శర్మ స్థానంలో టీ20 ప్రపంచకప్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుంటారని భావించినా అది కుదరలేదు. ఈ నిర్ణయంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగిందని చాలా మంది వాదిస్తున్నారు. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ప్రశ్నలు సంధించారు. సూర్యకుమార్ యాదవ్ మంచి కెప్టెన్ అని, అయితే ఖచ్చితంగా హార్దిక్‌కి కొంత అన్యాయం జరిగిందని అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..