AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: విరాట్ కోహ్లీతో మీ రిలేషన్‌షిప్ ఎలా ఉంది? ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఊహించని ఆన్సర్ ఇచ్చిన గంభీర్..

Gautam Gambhir on Virat Kohli: ఊహించిన విధంగానే ప్రెస్ కాన్ఫరెన్స్ లో గౌతమ్ గంభీర్‌కు ఎన్నో బర్నింగ్ క్వశ్చన్స్ వేయగా, వాటికి ధీటుగా సమాధానమిచ్చాడు. ఆ ప్రశ్నలలో ఒకటి విరాట్ కోహ్లీతో గంభీర్ సత్సంబంధాలపైనా కూడా అడిగారు. విరాట్‌తో రిలేషన్‌షిప్ గురించి అడిగిన ప్రశ్నకు కూడా గంభీర్ చక్కటి సమాధానం చెప్పుకొచ్చాడు. గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో చెప్పిన 5 కీలక విషయాలను తెలుసుకుందాం..

Virat Kohli: విరాట్ కోహ్లీతో మీ రిలేషన్‌షిప్ ఎలా ఉంది? ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఊహించని ఆన్సర్ ఇచ్చిన గంభీర్..
Gautam Gambhir On Virat Koh
Venkata Chari
|

Updated on: Jul 22, 2024 | 12:19 PM

Share

Gautam Gambhir on Virat Kohli: టీమ్ ఇండియా హెడ్ కోచ్ అయిన తర్వాత గౌతమ్ గంభీర్ మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. శ్రీలంక విమానం ఎక్కే ముందు, గంభీర్ ముంబైలో భారత జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. ఊహించిన విధంగానే ప్రెస్ కాన్ఫరెన్స్ లో గౌతమ్ గంభీర్‌కు ఎన్నో బర్నింగ్ క్వశ్చన్స్ వేయగా, వాటికి ధీటుగా సమాధానమిచ్చాడు. ఆ ప్రశ్నలలో ఒకటి విరాట్ కోహ్లీతో గంభీర్ సత్సంబంధాలపైనా కూడా అడిగారు. విరాట్‌తో రిలేషన్‌షిప్ గురించి అడిగిన ప్రశ్నకు కూడా గంభీర్ చక్కటి సమాధానం చెప్పుకొచ్చాడు. గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో చెప్పిన 5 కీలక విషయాలను తెలుసుకుందాం..

విరాట్‌తో తనకున్న రిలేషన్‌షిప్‌పై గంభీర్ ఓపెన్‌ కామెంట్స్..

విరాట్ కోహ్లీతో తనకున్న రిలేషన్ షిప్ గురించి గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. తమ మధ్య గొప్ప అనుబంధం ఉందంటూ చెప్పుకొచ్చాడు. విరాట్‌తో మెసేజ్‌ల ద్వారా మాట్లాడుతూనే ఉంటామని గంభీర్ పేర్కొన్నాడు. 140 కోట్ల మంది భారతీయులు గర్వించే అవకాశం వచ్చేలా టీమ్ ఇండియా బాగు కోసం మేమంతా చేయగలిగినదంతా చేస్తామని గంభీర్ తెలిపాడు.

వన్డేల్లో రోహిత్-విరాట్ భవిష్యత్తుపై..

వన్డే క్రికెట్‌లో రోహిత్-విరాట్ భవిష్యత్తుపై కూడా గంభీర్ చర్చించాడు. ప్రస్తుతం వీరిద్దరిలో క్రికెట్ చాలా మిగిలి ఉందని, ఇద్దరూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. తదుపరి ఛాంపియన్స్ ట్రోఫీ, ఆస్ట్రేలియా సిరీస్, ఆపై 2027 ODI ప్రపంచ కప్, ఇక్కడ రోహిత్-విరాట్ పాత్ర ముఖ్యమైనదంటూ తేల్చేశాడు.

బుమ్రా పనిభారంపై గంభీర్..

బుమ్రా పనిభారం గురించి కూడా గంభీర్ మాట్లాడాడు. ఫాస్ట్ బౌలర్ పనిభారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యమైన పని అంటూ తెలిపాడు. బుమ్రా మా అత్యంత ముఖ్యమైన బౌలర్. అతనిలాంటి బౌలర్ వందల్లో ఒకడు. అందువల్ల, ఆయన పనిభారాన్ని మెరుగ్గా నిర్వహించడం మా బాధ్యత అంటూ తెలిపాడు.

డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం అనుకూలిస్తేనే..

ప్రస్తుతం టీ20 ఛాంపియన్‌గా ఉన్న తమకు విజయవంతమైన జట్టు లభించిందని గౌతమ్ గంభీర్ తెలిపాడు. ఇటువంటి పరిస్థితిలో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని గొప్పగా ఉంచడం, ఆటగాళ్లను సంతోషంగా ఉంచడం మా ముఖ్యమైన పని తెలిపాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోని వాతావరణంపైనే జట్టు గెలుపు సూత్రం ఆధారపడి ఉంటుందని గంభీర్ అన్నాడు.

రవీంద్ర జడేజా గురించి ఏమన్నారు?

శ్రీలంక టూర్‌లో రవీంద్ర జడేజాకు చోటు దక్కకపోవడంపై గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ముందు టెస్టు సిరీస్ ఉందని, అక్కడ అతని పాత్ర కీలకమంటూ చెప్పుకొచ్చాడు. రాబోయే టెస్టు సిరీస్‌లో జడేజా తిరిగి జట్టులోకి వస్తాడని తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..