Hardik Pandya: గర్ల్ ఫ్రెండ్‌ను ముద్దులతో ముంచెత్తిన హార్దిక్ పాండ్యా.. ఫోటోస్ వైరల్..
నటాషాతో విడిపోయిన తర్వాత హార్దిక్ బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో కూడా కొద్ది రోజులు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే, మహియెకా శర్మతో డేటింగ్ రూమర్స్ మొదటగా 'రెడిట్' అనే సోషల్ మీడియా ద్వారా ప్రారంభమయ్యాయి. ఆమె షేర్ చేసిన సెల్ఫీ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించిన వ్యక్తి హార్దిక్ పాండ్యానే అని నెటిజన్లు గుర్తించడం గమనార్హం.

టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి వార్తల్లో నిలిచారు. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న తరువాత, హార్దిక్ నటి, మోడల్ మహియెకా శర్మ (Mahieka Sharma)తో డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలకు బలం చేకూరుస్తూ, హార్దిక్ స్వయంగా మహియెకాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలలో హార్దిక్, తన కుమారుడు అగస్త్యతో పాటు మహియెకా కూడా ఉన్నారు.
దివాళీ వేడుకలకు సంబంధించిన ఒక వీడియోలో, సంప్రదాయ దుస్తులు ధరించిన వీరిద్దరూ చాలా సంతోషంగా కనిపించారు. అందులో హార్దిక్ తన ప్రియురాలి బుగ్గపై ముద్దు పెడుతూ కనిపించారు. మరో ఫొటోలో హార్దిక్ జిమ్‌లో మహియెకాను ఎత్తుకుని నవ్వుతూ ఫోజు ఇచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
నటాషాతో విడిపోయిన తర్వాత హార్దిక్ బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో కూడా కొద్ది రోజులు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే, మహియెకా శర్మతో డేటింగ్ రూమర్స్ మొదటగా ‘రెడిట్’ అనే సోషల్ మీడియా ద్వారా ప్రారంభమయ్యాయి. ఆమె షేర్ చేసిన సెల్ఫీ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించిన వ్యక్తి హార్దిక్ పాండ్యానే అని నెటిజన్లు గుర్తించారు. అంతేకాకుండా, వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవ్వడం, కొన్ని ఫొటోల్లో ఒకే రకమైన బాత్‌రోబ్ ధరించడం, ఆసియా కప్ సమయంలో మహియెకా దుబాయ్‌కు వెళ్లడం వంటి అంశాలు ఈ పుకార్లను మరింత పెంచాయి. ఇటీవలే, సముద్రంలో ఇద్దరూ కలిసి సరదాగా గడిపిన ఫొటోలను కూడా హార్దిక్ పంచుకోవడంతో వీరి డేటింగ్ వార్తలు నిజమేనని అభిమానులు ధృవీకరించుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








