AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup Rising Stars 2025: పాకిస్తాన్ షాహీన్స్ జోరు.. గ్రూప్-బిలో ఇండియా A మెరుపులు!

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లో యువ క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ టోర్నమెంట్ గ్రూప్-స్టేజ్ చివరి దశకు చేరుకుంది. ఈ దశలో పాకిస్తాన్ షాహీన్స్, ఇండియా A తమ పవర్ఫుల్ ఆటతో అందరి దృష్టిని వీళ్లు ఆకర్షించారు.

Asia Cup Rising Stars 2025: పాకిస్తాన్ షాహీన్స్ జోరు.. గ్రూప్-బిలో ఇండియా A మెరుపులు!
Asia Cup Rising Stars 2025
Rakesh
|

Updated on: Nov 19, 2025 | 2:49 PM

Share

Asia Cup Rising Stars 2025: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లో యువ క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ టోర్నమెంట్ గ్రూప్-స్టేజ్ చివరి దశకు చేరుకుంది. ఈ దశలో పాకిస్తాన్ షాహీన్స్, ఇండియా A తమ పవర్ఫుల్ ఆటతో అందరి దృష్టిని ఆకర్షించారు. అటు గ్రూప్ A లో బంగ్లాదేశ్ A, శ్రీలంక A మధ్య కూడా ఆసక్తికరమైన పోటీ కొనసాగుతోంది. రెండు గ్రూపుల్లో జట్ల పరిస్థితి, సెమీఫైనల్ రేసులో ముందున్న టీమ్స్ వివరాలు చూద్దాం.

గ్రూప్ A లోని టీమ్స్ మధ్య సెమీఫైనల్ బెర్త్ కోసం తీవ్రమైన పోటీ ఉంది. బంగ్లాదేశ్ A తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 4 పాయింట్స్ తో అగ్రస్థానంలో నిలిచింది. వారి నెట్ రన్ రేట్ 4.079 గా ఉండటం వలన, సెమీస్‌కు చేరే రేసులో బంగ్లాదేశ్ ముందుంది. శ్రీలంక A, ఆఫ్ఘనిస్తాన్ A రెండూ రెండు మ్యాచ్‌లు ఆడి చెరో విజయం, ఒక ఓటమితో సమానంగా ఉన్నాయి. అయితే మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా శ్రీలంక A రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య క్వాలిఫికేషన్ కోసం ఇంకా గట్టి పోటీ కొనసాగుతోంది. అటు హాంగ్ కాంగ్ టీమ్ ఇంకా ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. దాదాపు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించినట్లుగానే భావించవచ్చు.

గ్రూప్ B లో పాకిస్తాన్ షాహీన్స్ అద్భుతమైన ఆటతీరుతో ఆధిపత్యం చలాయిస్తున్నారు. వారు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, 6 పాయింట్స్ మరియు 4.560 అనే అద్భుతమైన నెట్ రన్ రేటుతో సెమీఫైనల్‌లో తమ స్థానాన్ని పక్కా చేసుకున్నారు. ఇండియా A కూడా తమ ప్రదర్శనతో టైటిల్‌కు గట్టి పోటీదారులుగా నిరూపించుకున్నారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి 4 పాయింట్స్ తో, 1.979 నెట్ రన్ రేటుతో రెండో స్థానంలో ఉంది. గ్రూప్‌లో అత్యధికంగా 571 రన్స్ చేసిన ఘనత ఇండియా A దే కావడం విశేషం. ఇది వారి బ్యాటింగ్ బలాన్ని తెలియజేస్తుంది.

ఒమాన్ ఒక మ్యాచ్ గెలిచి 2 పాయింట్లు సాధించినా, వరుస ఓటములు, పేలవమైన నెట్ రన్ రేటు కారణంగా క్వాలిఫై అవడం కష్టంగా మారింది. ఇక యూఏఈ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ దశ పూర్తయ్యే స్టేజ్‎లో పాకిస్తాన్ షాహీన్స్, బంగ్లాదేశ్ A తమ గ్రూపులలో సేఫ్‎గానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇండియా A కూడా సెమీఫైనల్‌లో తమ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. అయితే శ్రీలంక A, ఆఫ్ఘనిస్తాన్ A వంటి టీమ్స్ మిగిలిన సెమీస్ టికెట్ కోసం తీవ్రంగా పోరాడాల్సి ఉంది. ఇకపై జరిగే మ్యాచ్‌లు టోర్నమెంట్ విజేతలను నిర్ణయించే కీలక మలుపు కానున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..