SRH vs PBKS, IPL 2024: అదరగొట్టిన అభిషేక్ శర్మ.. పంజాబ్‌ను చిత్తు చేసిన హైదరాబాద్
Sunrisers Hyderabad vs Punjab Kings: సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ అదరగొట్టింది. బౌలింగ్ లో విఫలమైనా, ఎదుట కొండంత లక్ష్యమున్నా బెదిరిపోలేదు. ఆదివారం (మే 19) పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యాన్ని కమిన్స్ సేన 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Sunrisers Hyderabad vs Punjab Kings: సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ అదరగొట్టింది. బౌలింగ్ లో విఫలమైనా, ఎదుట కొండంత లక్ష్యమున్నా బెదిరిపోలేదు. ఆదివారం (మే 19) పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యాన్ని కమిన్స్ సేన 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ ట్రావిడ్ హెడ్ మొదటి బంతికే డకౌటైనా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 66, 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా రాహుల్ త్రిపాఠి (33), నితీశ్ కుమార్ రెడ్డి (37), హెన్రిచ్ క్లాసెన్(42), షాబాజ్(3), సమద్(11 నాటౌట్), శాన్వీర్(6 నాటౌట్) పరుగులు చేయడంతో హైదరాబాద్ భారీ లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేసింది . పంజాబ్ బౌలర్లలో హర్షల్, అర్ష్‌దీప్ రెండేసి వికెట్లు.. హర్‌ప్రీత్, శశాంక్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
A successful chase of 2⃣1⃣5⃣ with 5 balls to spare! 😮@SunRisers finish their final league stage game with a 4⃣-wicket win at home 🧡
Scorecard ▶️ https://t.co/K5rcY5Z8FS#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/bwE7HjnMz9
— IndianPremierLeague (@IPL) May 19, 2024
ఇరు జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైడే, రిలీ రోసౌవ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(కెప్టెన్, కీపర్), అశుతోష్ శర్మ, శివమ్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్.
రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు..
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, జయదేవ్ ఉనద్కత్.
పంజాబ్ కింగ్స్: అర్ష్‌దీప్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, విధ్వత్ కావరప్ప, హర్‌ప్రీత్ సింగ్ భాటియా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.