Pakistan: ‘ఐసీయూలో పాకిస్తాన్ క్రికెట్.. ఆపరేషన్ చేయకపోతే అంతిమయాత్రే’.. అఫ్రిది షాకింగ్ కామెంట్స్
Shahid Afridi Slams PCB Decisions T20I Team: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, టీ20 జట్టులోకి ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ తిరిగి రావడాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. దేశవాళీ క్రికెట్‌లో షాదాబ్ పేలవ ప్రదర్శనను ఉదహరించి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని, అర్హత లేని ఆటగాళ్లను ఎంపిక చేస్తోందని ఆరోపించారు. పీసీబీ నిర్ణయాల వల్ల పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉందని ఆయన విమర్శించారు.

Shahid Afridi Criticizes Shadab Khan Selection: టీ20 జట్టులోకి ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ తిరిగి రావడాన్ని మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశ్నించాడు. తప్పుడు నిర్ణయాల కారణంగా పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉందంటూ విమర్శలు గుప్పించాడు. గత టీ20 ప్రపంచ కప్ నుంచి జట్టుకు దూరంగా ఉన్న షాదాబ్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసం సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా నియమించిన సంగతి తెలిసిందే.
మీడియాతో అఫ్రిది మాట్లాడుతూ..”ఏ ప్రాతిపదికన అతన్ని తిరిగి పిలిచారు?” అంటూ ప్రశ్నించాడు. దేశవాళీ క్రికెట్‌లో అతని ప్రదర్శన అస్సలు బాగోలేదని, అతన్ని మళ్లీ జట్టులోకి ఎలా ఎంపిక చేశారంటూ ఫైర్ అయ్యాడు. అర్హత ఆధారంగా నిర్ణయాలు తీసుకోనంత వరకు పాకిస్తాన్ క్రికెట్‌లో ఎలాంటి మార్పులు ఉండవంటూ మాజీ ఆల్ రౌండర్ షాకిచ్చాడు.
ఐసీయూలో పాక్ జట్టు.. చికిత్స జరగాల్సిందే..
‘పాకిస్తాన్ క్రికెట్ తప్పుడు నిర్ణయాల కారణంగా ఐసియులో ఉంది. కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించినప్పుడల్లా ఆయన వచ్చి ప్రతిదీ మారుస్తారంటూ’ ఆయన విమర్శలు గుప్పించాడు.
మాజీ కెప్టెన్ అఫ్రిది మాట్లాడుతూ “బోర్డు నిర్ణయాలు సరైనవి కావు. వారు నిరంతరం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఎక్కువ కాలం నిలిచి ఉండే నిర్ణయాలు తీసుకోవడం లేదు. కెప్టెన్లను, కోచ్‌లను లేదా కొంతమంది ఆటగాళ్లను మారుస్తూనే ఉన్నారు. కానీ, బోర్డు అధికారుల జవాబుదారీతనం ఇదేనా?, కోచ్ తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఆటగాళ్లను నిందించడం చూడటం బాధగా ఉంది. ఆటగాళ్లను, కోచ్‌ను తమ స్థానాన్ని కాపాడుకోవడానికి యాజమాన్యం నిందించడం చూడటం బాధగా ఉందని’ అని ఆయన అన్నాడు.
“కెప్టెన్, కోచ్ తలలపై డామోక్లెస్ కత్తి నిరంతరం వేలాడుతుండగా పాక్ క్రికెట్ ఎలా పురోగమిస్తుంది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సానుకూల వ్యక్తి అని నేను అనుకున్నాను. కానీ, నిజం ఏమిటంటే అతనికి క్రికెట్ గురించి పెద్దగా తెలియదు” అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..