Video: ధోని అదిరిపోయే స్టెప్పులు.. జత కలిసిన రైనా.. పంత్ సోదరి పెళ్లిలో మాములు రచ్చ కాదు భయ్యో..
Rishabh Pant Sister Wedding: రిషబ్ పంత్ సోదరి వివాహానికి భారత క్రికెటర్ల ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. ఇప్పటికే చాలామంది ముస్సోరికి చేరుకున్నారు ఇంకా చాలా మంది వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పంత్ సోదరి వివాహానికి అతిథులుగా వచ్చే క్రికెటర్లు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Rishabh Pant Sister Wedding: రిషబ్ పంత్ సోదరి వివాహం నేడు అంటే మార్చి 12న జరగనుంది. వివాహానికి హాజరు కావడానికి ఎంతోమంది అతిథులు హాజరవుతున్నారు. ఈ అతిథుల జాబితాలో ఎంతోమంది క్రికెటర్లు ఉన్నారు. పంత్ సోదరి వివాహాంలో ఈ క్రికెటర్లంతా తెగ సందడి చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని గురించి తప్పక చెప్పుకోవాల్సిందే. ధోని తన భార్య సాక్షితో కలిసి ముస్సోరీ చేరుకున్నాడు. పంత్ పట్ల ధోనీకి ఉన్న ప్రేమే అతన్ని అక్కడికి చేర్చింది. గత సంవత్సరం, పంత్ సోదరి నిశ్చితార్థం జరిగినప్పుడు కూడా ధోని కూడా హాజరయ్యాడు. ధోనితో పాటు రోహిత్, విరాట్ కూడా ముస్సోరీకి చేరుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
రోహిత్ – విరాట్‌తోపాటు ధోనీ కూడా..
రిషబ్ పంత్ సోదరి వివాహంలో రోహిత్, విరాట్ కూడా పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తనతో పాటు, పంత్ తన సోదరి వివాహానికి ఐసీసీ చైర్మన్ జై షాను కూడా ఆహ్వానించాడు. మీడియా నివేదికల ప్రకారం, వారందరూ మార్చి 12న ముస్సోరీ చేరుకునే అవకాశం ఉంది. మొత్తం మీద, రిషబ్ పంత్ సోదరి వివాహంలో క్రికెట్ ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరుకానున్నారు.
పంత్ సోదరి వివాహానికి హాజరైన క్రికెటర్లు ఎవరు?
పంత్ సోదరి వివాహానికి భారత క్రికెట్‌లోని ముగ్గురు స్టార్ ప్లేయర్లు ధోని, రోహిత్, విరాట్ హాజరుకానున్నారు. వీరితో పాటు, వివాహానికి ముస్సోరీ చేరుకున్న క్రికెటర్లలో సురేష్ రైనా, పృథ్వీ షా, నితీష్ రాణా వంటి పెద్ద పేర్లు ఉన్నాయి. శుభ్‌మాన్ గిల్, పంత్‌తో పాటు మరికొందరు క్రికెట్ సహచరులు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఫొటోలు పంచుకున్న రైనా, షా..
View this post on Instagram
రిషబ్ పంత్ సోదరి సాక్షి వివాహం కోసం ముస్సోరీకి చేరుకున్న క్రికెటర్లు కూడా అక్కడి ఫొటోలను పోస్ట్ చేయడం ప్రారంభించారు. ధోని, అతని భార్యతో సహా తన కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోను రైనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పృథ్వీ షా తన ఇన్‌స్టా స్టోరీలో ధోని, రైనా, అతని కుటుంబంతో ఉన్న ఫొటోను పంచుకున్నారు.
అమ్మాయి సోదరుడితో ధోని అద్భుతమైన డాన్స్..
Rishabh Pant , MS Dhoni & Suresh Raina dancing together 🕺🕺😂😂 pic.twitter.com/b03FSVUvGv
— Riseup Pant (@riseup_pant17) March 11, 2025
పెళ్లిలో ధోని చేసిన నృత్యం కూడా వైరల్ అవుతోంది. “దమదం మస్త్ కలందర్” పాటకు తన డ్యాన్స్‌తో ధోని అలరించాడు. దీనికి రైనా, రిషబ్ పంత్ కూడా మద్దతుగా నిలిచారు.
అయితే, తాజా వార్తల ప్రకారం, రోహిత్, విరాట్ కూడా ఈ వేడుకలో భాగమయ్యేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.