Sanju Samson: ఆ ముగ్గురి వల్లే సంజూ శాంసన్‌కు మొండిచేయి.. ఇకపై భారత జట్టుకు ఆడడం కష్టమేనా?

India vs Australia: ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో విఫలమైన తర్వాత, ఇప్పుడు టీమ్ ఇండియా ఆస్ట్రేలియాతో T20 సిరీస్‌ను సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. నవంబర్ 23 నుంచి 5 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుండగా, ఇందుకోసం టీమిండియాను కూడా బీసీసీఐ ప్రకటించింది. అయితే, జట్టు ప్రకటన తర్వాత సంజూ శాంసన్‌కు అవకాశం రాకపోవడంతో అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Sanju Samson: ఆ ముగ్గురి వల్లే సంజూ శాంసన్‌కు మొండిచేయి.. ఇకపై భారత జట్టుకు ఆడడం కష్టమేనా?
Sanju Samson
Follow us
Venkata Chari

|

Updated on: Nov 21, 2023 | 6:16 PM

India vs Australia: సంజూ శాంసన్‌ని ఎందుకు ఎంపిక చేయలేదు, ఆ ఆటగాడు చేసిన తప్పేంటి, సంజు శాంసన్‌కి ఎందుకు ఇంత అన్యాయం? టీమ్ ఇండియాను ఎప్పుడు ప్రకటించినా, ఇలాంటి ప్రశ్నలే అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. అయినా, బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం మరోసారి ఈ కేరళ ఆటగాడిపై దయ చూపలేదు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో, క్రికెట్ అభిమానులు బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. సోమవారం, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ 15 మంది సభ్యుల జట్టులో సంజూ శాంసన్‌ను చేర్చలేదు. సంజూ శాంసన్ పేరు కనిపించకపోవడంతో అభిమానులు మరోసారి భారత సెలెక్టర్లపై ప్రశ్నలు లేవనెత్తారు.

అయితే, ఈసారి సంజూ శాంసన్‌ను ఔట్ చేయడం అనే ప్రశ్న కాస్త విచిత్రంగా ఉంది. దీనికి సమాధానం కూడా చాలా సులభం. సంజూ శాంసన్‌కు భారత T20 జట్టులో ఎందుకు చోటు దక్కలేదో ఇప్పుడు చూద్దాం. సెలెక్టర్లు ఈ ఆటగాడిపై విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది. ఇది మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు. కానీ, దీనికి గల కారణాలను కచ్చితంగా తెలుసుకోవాలి.

ఇవి కూడా చదవండి

సంజు శాంసన్ టీ20 కెరీర్..

సంజూ శాంసన్‌ను టీ20 జట్టులో ఎంపిక చేయకపోవడానికి అతని ఫామ్‌ కారణం. ఈ ఆటగాడు గత రెండు టీ20 సిరీస్‌లలో టీమ్ ఇండియాలో భాగమయ్యాడు. వెస్టిండీస్‌లో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొన్న సంజూ ఐర్లాండ్‌లో ఆడిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో కూడా అవకాశం పొందాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో సంజూ 32 పరుగులు మాత్రమే చేశాడు. ఇది మాత్రమే కాదు, అతను ఐర్లాండ్‌తో ఆడిన 2 మ్యాచ్‌ల్లో 41 పరుగులు చేశాడు. అతని టాప్ స్కోరు 27 పరుగులు. ఒకటి లేదా రెండు సిరీస్‌ల నుంచి ఆటగాడిని వదులుకోవడం సరికాదని, అయితే శాంసన్ అతని T20 కెరీర్‌లో మొత్తం 24 T20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో అతని బ్యాటింగ్ సగటు 20 కంటే తక్కువగా ఉంది. ఇప్పుడు ఆలోచించండి, ఒక ఆటగాడు బ్యాట్‌తో ఘోరంగా విఫలమైతే, సెలెక్టర్లు అతనిని జట్టులో ఎందుకు ఎంపిక చేస్తారు? అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సంజుకు ప్రత్యామ్నాయం..

సంజూ శాంసన్‌ను దూరంగా ఉంచడానికి ఒక కారణం ఏమిటంటే, టీమ్ ఇండియాకు ఎంపికల కొరత లేకపోవడం. టీమ్ ఇండియాకు చాలా ఎంపికలు ఉన్నాయి. ఇందులో తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ ఉన్నారు. తిలక్ వర్మ గురించి మాట్లాడితే, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌తో పాటు, అతను బౌలింగ్ కూడా చేయగలడు. మ్యాచ్ ఫినిషర్‌గా రింకూ సింగ్ వేగంగా దూసుకుపోతున్నాడు. జితేష్ శర్మ తన దూకుడు బ్యాటింగ్, వికెట్ కీపింగ్ నైపుణ్యంతో సెలెక్టర్లను కూడా ఆకట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సెలక్టర్లు సంజూ శాంసన్‌ని పక్కన పెట్టారని తెలుస్తోంది.

SMATలోనూ సంజూ విఫలం..

టీమ్ ఇండియాలో పునరాగమనం చేసేందుకు సంజూ శాంసన్‌కు మంచి అవకాశం లభించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను 6 మ్యాచ్‌లు ఆడాడు. అయితే అక్కడ కూడా అతని బ్యాట్ పనిచేయలేదు. శాంసన్ 27.60 సగటుతో 138 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఒకవేళ సంజూ ఈ టోర్నీలో మెరుగ్గా రాణించి ఉంటే జట్టులోకి ఎంపికయ్యేవాడని అంతా భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..