Siraj: ఓ ఇంటి వాడు కానున్న హైదరాబాదీ స్టార్ క్రికెటర్ సిరాజ్.? వధువు ఎవరంటే.?
మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, అనతి కాలంలోనే స్టార్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇక తాజాగా భారత వేదికగా జరిగిన ప్రపంచకప్‌లోనూ సిరాజ్ మంచి ఆటతీరును కనబరిచాడు. మొత్తం 11 మ్యాచ్‌లలో 33.50 సగటుతో 14 వికెడ్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. శ్రీలంకపై మాత్రం 16 పరుగులిచ్చి ఏకంగా 3 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే...
మహమ్మద్ సిరాజ్.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అద్భుత బౌలింగ్‌తో టీమిండియాకు ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఒక ఓవర్లు నాలుగు వికెట్లు తీసిన ఏకైక భారతీయ బౌలర్‌గా అరుదైన గుర్తింపును సంపాదించుకున్నాడు సిరాజ్ మన హైదరాబాదీ అనే విషయం తెలిసిందే.
మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, అనతి కాలంలోనే స్టార్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇక తాజాగా భారత వేదికగా జరిగిన ప్రపంచకప్‌లోనూ సిరాజ్ మంచి ఆటతీరును కనబరిచాడు. మొత్తం 11 మ్యాచ్‌లలో 33.50 సగటుతో 14 వికెడ్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. శ్రీలంకపై మాత్రం 16 పరుగులిచ్చి ఏకంగా 3 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే 29 ఏళ్ల ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వివాహానికి సంబంధించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది.
సిరాజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సిరాజ్ ఓ ఇంటివాడు కానుడాని తెలుస్తోంది. సిరాజ్ త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్లు, హైదరాబాద్‌కు చెందిన అమ్మాయితో సిరాజ్ ఏడడుగులు వేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మధ్యలో సిరాజ్ వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇక సిరాజ్ వివాహానికి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హాజరుకానున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే సిరాజ్ వివాహానికి సంబంధించి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ సిరాజ్ వివాహం చేసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తన చిన్ననాటి స్నేహితురాలినే వివాహమాడనున్నట్లు వార్తలు వచ్చాయి, అయితే ఈ వార్తపై స్పందించడానికి సిరాజ్ ఆ సమయంలో నిరాకరించాడు. దీంతో వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. అయితే ఇప్పుడు మళ్లీ సిరాజ్ పెళ్లిపై పుకార్లు చేస్తున్నాయి. మరి దీనిపై సిరాజ్‌ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..